Vasireddy padma: ఆడవాళ్లను కించపరిస్తే కఠిన చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2023-07-05T14:46:28+05:30 IST
మహిళలపై పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. విజయవాడలో జరిగిన సెమినార్‌లో ఆమె మాట్లాడారు. ‘‘సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడిలో సీఎం కుటుంబ సభ్యులు, మహిళా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అన్న తేడా లేకుండా పోతుంది.
విజయవాడ: మహిళలపై పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) హెచ్చరించారు. విజయవాడలో జరిగిన సెమినార్‌లో ఆమె మాట్లాడారు. ‘‘సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడిలో సీఎం కుటుంబ సభ్యులు (CM Jagan family), మహిళా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అన్న తేడా లేకుండా పోతుంది. మహిళలు అడుగు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిపై వేలెత్తి చూపాల్సిన బాధ్యత ఉంది. మహిళల పట్ల ఇలాగే సోషల్ మీడియాలో వ్యవహరిస్తామని అంటే రోడ్డుపై తన్నులు తినే రోజులు వస్తాయి. మహిళలు కూడా సోషల్ మీడియాలో సంయమనం పాటించాలి. అవసరం అయితే చట్టాలు, శిక్షలు మార్చాలి. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిని వదిలి పెట్టం. మహిళలను మళ్లీ ఇళ్లకు పరిమితం చేయాలని చూస్తున్నారు. రాజకీయ పార్టీలను సెమినార్‌కు ఆహ్వానించలేదు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సెమినార్ నిర్వహిస్తున్నాం. అయినా ఎవరి గొంతు నొక్కటం లేదు. రాజకీయ పార్టీల ప్రకటనలతో, విమర్శలతో సంబంధం లేకుండా మాట్లాడితే అందరికీ స్వాగతం పలుకుతాం. శుక్రవారం గౌరవ దినంగా పాటించాలని కోరుతున్నాం.’’ అని వాసిరెడ్డి పద్మ తెలిపారు.