Buddha Venkanna: మళ్లీ‌ చంద్రబాబు సీఎం అవడం ఖాయం..‌

ABN , First Publish Date - 2023-03-18T11:35:09+05:30 IST

టీడీపీ నేత బుద్దా వెంకన్న(TDP leader Buddha Venkanna) నివాసం వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు..

Buddha Venkanna: మళ్లీ‌ చంద్రబాబు సీఎం అవడం ఖాయం..‌

విజయవాడ: టీడీపీ నేత బుద్దా వెంకన్న(TDP leader Buddha Venkanna) నివాసం వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. బుద్దా‌వెంకన్న బాణాసంచా పేల్చి సందడి‌ చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న(Buddha Venkanna) మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో(Graduates MLC election) మంచి తీర్పు ఇచ్చిన వారందరికీ పాదాభివందనం. మళ్లీ‌ చంద్రబాబు(Chandrababu) సీఎం అవడం ఖాయం..‌ఇందుకు ఈ ఫలితమే నిదర్శనం. రూ. కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీని ఛీ కొట్టారు. అడ్డదారుల్లో విజయం సాధించాలన్న వైసీపీకి (YCP) మంచి బుద్ది చెప్పారు. 151 సీట్లు ఇస్తే రాక్షస పాలన సాగిస్తున్న జగన్ (JAGAN) ఇంటికి‌ వెళ్లడం ఖాయం. దేవుడు రాసిన స్క్రిప్ట్ కాబట్టే 14నెలలు ముందుగానే నీ ఓటమికి బాటలు వేశాడు. కుప్పంలో ‌చెత్త కుప్పను‌ కూడా కొట్టలేవు. ముందు‌ నీ పులివెందులలోనే ప్రజలు నీ‌పాలనను‌ వ్యతిరేకించారు. బాబాయిని కూడా చంపించి రాజకీయ డ్రామా ఆడావు. ఈ సెమీ ఫైనల్‎లో ఓడిపోయిన జగన్... ఇప్పుడు అయినా బుద్ది తెచ్చుకోవాలి. కృష్ణా జిల్లాలో టీడీపీ బిక్షతో పెరిగిన కొడాలి నాని(Kodali Nani), వంశీ(Vamsi), అవినాష్‎లు(Avinash) మూట ముల్లె సర్దుకుంటున్నారు. విదేశాల్లోకి‌‌ వెళ్లేందుకు అన్నీ సిద్దం చేసుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలు‌ చేసి‌న వాళ్లు ఈ‌ ఫలితాల‌తో అయినా బుద్ది తెచ్చుకోవాలి. జూన్ నుంచి విశాఖ పాలన అన్న జగన్‎ను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ నాయకులను అసహ్యించుకుంటున్నారు.సీఎం జగన్ (CM JAGAN), విజయసాయి రెడ్డిలు(Vijayasai Reddy) వేల‌ కోట్ల భూములను’’‌ దోచుకున్నారు.

వైజాగ్‎లో ‘‘గ్లోబల్ సమ్మిట్(Global Summit) కాదు..జె సమ్మిట్.. బినామీల ద్వారా మళ్లీ‌ భూముల దోపిడికి సిద్దం అయ్యారు. ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాతో సీఎం జగన్ (Jagan) స్వయంగా దోచుకుంటే ఇక ఎవరికి చెప్పాలి. వైయస్(YS) హయాంలో సూట్ కేసు కంపెనీలు పేరుతో దోచారు. ఇప్పుడు లేని‌ కంపెనీలు పేరుతో దోచేస్తున్నారు. ఇప్పుడు అయినా జగన్ ఓటమిని అంగీకరించి రాజీనామా చేయాలని’’ బుద్దా వెంకన్న అన్నారు.

Updated Date - 2023-03-18T11:35:09+05:30 IST