Share News

Devineni Uma: వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేసింది

ABN , First Publish Date - 2023-12-04T15:10:32+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను భారీగా ప్రారంభిస్తామని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) పేర్కొన్నారు.

Devineni Uma: వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేసింది

ఎన్టీఆర్ జిల్లా - మైలవరం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను భారీగా ప్రారంభిస్తామని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) పేర్కొన్నారు. సోమవారం నాడు మైలవరంలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేసి 500 రోజులు పూర్తి అయిన సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు. అన్నా క్యాంటీన్లలో పేదలకు దేవినేని ఉమా పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. అన్నా క్యాంటీన్లలో పేదలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేసిందని మండిపడ్డారు. పేదలకు భోజనం పెట్టడమే ఎన్టీఆర్ గారి ధ్యేయమని చెప్పారు. టీడీపీ జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయాన్ని వైసీపీ ప్రభుత్వం నీరు గార్చిందని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైలవరం నియోజకవర్గంలోని ఐదు మండల కేంద్రాల్లో శాశ్వత అన్నా క్యాంటీన్లను భవనాలు నిర్మాణం చేస్తామని చెప్పారు. మైలవరంలో ఫిల్లర్ దశలో ఉన్న భవనాన్ని పూర్తి చేసి చంద్రబాబు నాయుడును తెచ్చి ప్రారంభిస్తామని దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2023-12-04T15:12:02+05:30 IST