Vallabhaneni Vamshi: ఈ ఎదవలంతా ఎలా సంపాదించారో.. నేనూ అలాగే
ABN , First Publish Date - 2023-02-02T14:11:41+05:30 IST
కృష్ణా జిల్లా వైసీపీ నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది.
విజయవాడ: కృష్ణా జిల్లా వైసీపీ నేతల (YCP Leaders మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Gannavaram MLA Vallabhaneni Vamshi), వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు (Dutta Ramachandra Rao) మధ్య వివాదం మరింత ముదిరింది. ఇటీవల గుంటూరు జిల్లా వైకుంఠపురంలో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొడాలినాని (Kodali Nani), వంశీ (Vamshi)పై వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు (YarlaGadda Venkatrao) చేసిన వ్యాఖ్యలను ఎవరో రికార్డ్ చేయడంతో అవి ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారాయి. ‘‘వల్లభనేని వంశీ, కొడాలి నానికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారు’’ అని వారు ప్రశ్నించారు. వల్లభనేని వంశీ ఆగడాలను ప్రశ్నించబట్టే తమకు ప్రజల్లో గుర్తింపు వచ్చిందంటూ దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ అన్నట్లు ఆడియోలో రికార్డు అయ్యింది.
దీనిపై వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపగడపలో కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే.. గుడికి వెళ్లి పిచ్చివాగుడు వాగుతున్న మానసిక రోగులు అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఎదవలు అందరూ ఎలా సంపాదించారో కొడాలి నాని, నేను కూడా అలాగే సంపాదించాం. వాళ్లకు లాగా గోనెసంచల్లో మూటలు కట్టుకొని కాటికి వెళ్ళినాక వాడుకోవడానికి దాచుకోవడం లేదు పదిమందికి మేము ఖర్చు పెడుతున్నాం. నాతో కలిసి ప్రయాణం చేస్తే వాళ్ళ అదృష్టం లేకపోతే వాళ్ళ కర్మ. దుట్టా రామచంద్రరావు నాకు ఎప్పుడు పనిచేయలేదు. దుట్టా రామచంద్రరావు కూతురిని గెలిపించింది నేనే. దుట్టా రామచంద్రరావు కొడుకుకి, పనిచేయాలి అల్లుడికి పని చేయాలి కాని.. పార్టికి పనిచేయడు’’ అంటూ ధ్వజమత్తారు.
ఆ రికార్డులో ఏమీ లేదు: దుట్టా
కాగా.. జగన్ (AP CM JaganMohanReddy)ను సైకో అన్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలను దుట్టా రామచంద్రరావు ఖండించారు. గుడి ప్రారంభోత్సవం నిమిత్తం తాను, యార్లగడ్డ వెంకట్రావు కలుసుకున్నామని తెలిపారు. అయితే సీఎం జగన్ (AP CM)ను సైకో అని తామిద్దం అన్నామంటూ కొన్ని ఛానళ్లు ప్రచారం చేశాయని.. అలా అని తాము ఏమీ అనలేదని స్పష్టం చేశారు. ‘‘40 సంవత్సరాల నుండి నేను డాక్టర్ వృత్తిలో ఉన్నా. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మాకు దగ్గర సంబంధం ఉంది. మేము చచ్చిపోయే వరకు మా కుటుంబ సభ్యులు జగన్‌తోనే ఉంటాం. వల్లభనేని వంశీతో కలిసి ప్రయాణం చేయమని అధిష్టానం చెప్పింది. వంశీతో కలిసి నేను ప్రయాణం చెయ్యను అని అధిష్టానానికి చెప్పాను. వంశీతో గొడవ పడవద్దని అధిష్టానం నాకు చెప్పింది. అధిష్టానం మాటకే నేను కట్టుబడి ఉన్నాను. యార్లగడ్డ వెంకట్రావు కూడా వైసీపీ పార్టీకి కట్టుబడి ఉన్నారు. సీఎం జగన్‌ను తిట్టే మనస్తత్వం మాది కాదు. అందరం సరదాగా కూర్చుని మాట్లాడుకునే టైంలో ఎవరు రికార్డ్ చేశారో తెలియదు. ఆ రికార్డులో అనకూడని మాటలు ఏమీ లేవు’’ అని దుట్టా రామచంద్రరావు స్పష్టం చేశారు.