AP Politics: పవన్‌కల్యాణ్ ఢిల్లీ టూర్‌పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-07-19T14:39:31+05:30 IST
ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న పవన్‌కల్యాణ్.. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు కలిసి వెళ్తాయని అంటున్నారు. పవన్‌కల్యాణ్‌ను దూతగా పంపి బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారు. మోదీని ఇష్టం వచ్చిన విధంగా చంద్రబాబు దూషించారు. ఇప్పుడేమో జనసేనాని ఢిల్లీకి దూతగా పంపారు.
మచిలీపట్నం: చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మచిలీపట్నం జడ్పీ సమావేశంలో మంత్రి రోజా (Minister Roja) పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న పవన్‌కల్యాణ్.. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు కలిసి వెళ్తాయని అంటున్నారు. పవన్‌కల్యాణ్‌ను దూతగా పంపి బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు (Chandrababu) ఆరాటపడుతున్నారు. మోదీని ఇష్టం వచ్చిన విధంగా చంద్రబాబు దూషించారు. ఇప్పుడేమో జనసేనాని ఢిల్లీకి దూతగా పంపారు. పొత్తులు పెట్టుకోను అని గతంలో పవన్ (Pawan Kalyan) ప్రకటించారు. గొంతు కోసుకుంటా.. ఆత్మ గౌరవం తాకట్టు పెట్టను అని ఆనాడు అన్నారు. ఇప్పుడు పొత్తుకు వెళ్తున్న పవన్ గొంతు కోసుకుంటారా? యాత్రలో ఊగిపోయిన పవన్‌కు రాష్ట్రం మీద అవగాహన లేదు. సీఎం అంటే అర్థం తెలియకుండా పవన్ ఏదేదో మాట్లాడుతున్నారు.’’ అని రోజా దుయ్యబట్టారు.