TD Janardhan : వైసీపీ ప్రభుత్వం విదేశీ విద్యను నిర్వీర్యం చేసింది
ABN , First Publish Date - 2023-10-04T16:16:14+05:30 IST
విదేశీ విద్యను వైసీపీ ప్రభుత్వం(YCP Govt) నిర్వీర్యం చేయడంతో.. విదేశాలకు వెళ్లిన విద్యార్థులు పెట్రోల్ బంకుల్లో పనిచేయాల్సిన పరిస్థితి దాపురించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్(TD Janardhan) వ్యాఖ్యానించారు.
కృష్ణా: విదేశీ విద్యను వైసీపీ ప్రభుత్వం(YCP Govt) నిర్వీర్యం చేయడంతో.. విదేశాలకు వెళ్లిన విద్యార్థులు పెట్రోల్ బంకుల్లో పనిచేయాల్సిన పరిస్థితి దాపురించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్(TD Janardhan) వ్యాఖ్యానించారు. చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్ట్‌కు నిరసనగా కైకలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేపట్టిన నిరాహార దీక్షలకు బుధవారం నాడు టీడీ జనార్ధన్ సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా టీడీ జనార్ధన్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను బయటపెడుతున్నారన్న కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు. రాక్షస పాలనలో ఏపీలో పెట్టుబడులు పెట్టే నాధుడు కరువయ్యాడు. గతంలో చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమా, విదేశీ విద్య, కళ్యాణమస్తు పథకాలతో పేద కుటుంబాలకు అండగా నిలిచారు. అన్యాయ, అధర్మ, అక్రమ పాలనను రాష్ట్రం నుంచి తరిమి వేయాలి’’ అని టీడీ జనార్ధన్ హెచ్చరించారు.