MLC Elections: మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్న టీడీపీ అధినేత

ABN , First Publish Date - 2023-03-13T11:50:58+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నారు.

MLC Elections: మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్న టీడీపీ అధినేత

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) పై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (TDP National President Nara Chandrababu Naidu) మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నారు. పోలింగ్‌లో అక్రమాలు, వైసీపీ (YCP) దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులను పార్టీ నేతలు అధినేతకు వివరించారు. వివిధ ఘటనలపై కడప ఎస్పీ (Kadapa SP), తిరుపతి జిల్లా ఎస్పీ (Tirupati SP), కలెక్టర్లతో చంద్రబాబు (TDP Chefi) ఫోన్‌లో మాట్లాడారు. ఉదయం నుంచి జరిగిన ఘటనలు అధికారులకు వివరించి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఇంత స్థాయిలో అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలు దిగకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు.

బస్సుల్లో, ప్రత్యేక వాహనాల్లో ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా యంత్రాంగం మౌనంగా ఉందన్నారు. పట్టభద్రులు ఓటువేయాల్సిన ఎన్నికల్లో అనర్హులతో, నిరక్షరాస్యులతో బోగస్ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పక్షాల ఫిర్యాదులను ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకోవాలన్నారు. తిరుపతిలో బోగస్ ఓట్లపై అభ్యంతరాలు తెలిపిన టీడీపీ నేతల (TDP Leaders) ను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు సమీక్ష సమావేశంలో టీడీడీ ముఖ్యనేతలు యనమల (Yanamala Ramkrishnudu), నక్కా ఆనంద్ బాబు Nakka Anand babu), కొల్లు రవీంద్ర (Kollu Ravindra), బోండా ఉమ (Bonda Uma), టీడీ జనార్ధన్ (TD Janardhan) తదితర నేతలు పాల్గొన్నారు.

కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాప్తాడు పోలింగ్ బూత్ నంబర్ 150లో దొంగ ఓటర్లను టీడీపీ నేతలు గుర్తించారు. నలుగురు దొంగ ఓటర్లను పట్టుకుని టీడీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి పోలింగ్ బూత్‌లో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తూ వైసీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కనిపించారు.

ఇక ప్రొద్దుటూరులోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. బహిరంగంగానే వైసీపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు దగ్గరలోనే డబ్బులు పంపిణీ చేయడం గమనార్హం. వైవీఎస్‌తోపాటు పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు రూ. 1000 చొప్పున వైసీపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సమీపంలో పోలీసులు ఉన్నా కూడా చర్యలు శూన్యమన్నారు.

Updated Date - 2023-03-13T11:50:58+05:30 IST