Kollu ravindra: పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తే పట్టించుకోరా? ఏపీ పోలీస్ సంఘాలకు పౌరుషం లేదా?
ABN , First Publish Date - 2023-08-12T15:15:22+05:30 IST
పోలీసుల పౌరుషం ప్రతిపక్షాలపైనేనా? పోలీసు కానిస్టేబుల్ రాధమ్మపై దాడి చేస్తే పోలీసులకి పౌరుషం రాదా..? మహిళా కానిస్టేబుల్ రాధమ్మకు అన్యాయం జరిగితే పోలీస్ సంఘాల పౌరుషం ఏమైంది..?, ఓ మహిళా కానిస్టేబుల్ వైసీపీ కార్పొరేటర్ దాడి చేస్తే పోలీసులకు చలనం లేదా?
అమరావతి: అనంతపురం జిల్లాలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌పై వైసీపీ కార్పొరేటర్ దాడిని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (kollu ravindra) ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసుల పౌరుషం ప్రతిపక్షాలపైనేనా? పోలీసు కానిస్టేబుల్ రాధమ్మపై దాడి చేస్తే పోలీసులకి పౌరుషం రాదా..? మహిళా కానిస్టేబుల్ రాధమ్మకు అన్యాయం జరిగితే పోలీస్ సంఘాల పౌరుషం ఏమైంది..?, ఓ మహిళా కానిస్టేబుల్ వైసీపీ కార్పొరేటర్ దాడి చేస్తే పోలీసులకు చలనం లేదా?, తెలుగుదేశం మీద మొరిగే వాళ్ల చెవులకు ఇవి వినిపించావా..?, స్టేషన్ మీద, సిబ్బంది మీద దాడి జరిగితే.. మహిళా కానిస్టేబుల్ రాధమ్మ ధైర్యంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?, బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ రాధమ్మను ఎందుకు వేధింపులకు గురిచేసి కేసును వాపస్ తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. అవసరమైతే బాధితురాలైన కానిస్టేబుల్ రాధమ్మపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని భయపెడుతున్న ఈ వ్యవస్థను దేనితో కడగాలి. వైసీపీ ప్రభుత్వ అరాచకం స్మృతి మించిపోతుంది. ప్రతిపక్ష పార్టీలపై దాడులకు తెగబడుతున్నారు. పోలీస్ స్టేషన్ల మీదే దాడికి దిగబడుతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి ఈ వ్యవస్థలకు చీమకుట్టినట్టైనా కూడా లేదు. ఈ ప్రభుత్వం అధికార మదంతో చేస్తున్న అరాచకాలకు చమరగీతం పడాల్సిన సమయం ఆసన్నమైంది.’’ అని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.