VarlaRamaiah: ‘లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి ట్రై చేస్తోంది ఆయనే...’

ABN , First Publish Date - 2023-02-09T15:22:43+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించడంపై ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

VarlaRamaiah: ‘లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి ట్రై చేస్తోంది ఆయనే...’

అమరావతి: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh YuvaGalam Padayatra) పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించడంపై ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Politbureau Member Varla Ramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)కు అడుగడుగునా ఆంటకాలు కలిగిస్తూ విధ్వంసరచన చేస్తోంది ముఖ్యమంత్రి (AP CM)కి అత్యంత సన్నిహితుడైన డీఐజీ కొల్లి రఘురామిరెడ్డే (DIG Kolli RaghuramiReddy) అని ఆరోపించారు. లోకేష్ పాదయాత్ర (YuvaGalam)కు వస్తున్న ప్రజాస్పందన చూసి ప్రభుత్వానికి కన్నుకుట్టిందన్నారు. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెల్లుబుకుతున్న చైతన్యాన్ని చూసి ఓర్వలేకనే యువగళం యాత్రను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. లోకేష్ పాదయాత్ర (Lokesh YuvaGalam) విధ్వంసరచనకు డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి అన్నీతానై వ్యవహరిస్తున్నారని అన్నారు. స్థానిక పోలీసుల్ని భయపెట్టి లోకేష్ యాత్ర (YuvaGalam Padayatra)కు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

పాదయాత్ర (Padayatra) జరిగితే అతని పాదం వైసీపీ ప్రభుత్వాన్ని (YCP Government) పాతాళంలోకి తొక్కేస్తుందన్న భయంతోనే డీఐజీ కొల్లి రఘురామిరెడ్డిని సీఎం జగన్ (AP CM YS Jaganmohan Reddy), సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) యువగళం యాత్రపైకి ప్రయోగించారన్నారు. జగన్మోహన్ రెడ్డి (Jagan Reddy)ని సంతృప్తిపరచడం, తప్పుడుకేసుల రచన తప్ప రఘురామిరెడ్డికి మరోపనిలేదని వ్యాఖ్యలు చేశారు. రఘురామిరెడ్డి గతచరిత్ర మొత్తం తమ వద్ద ఉందన్నారు. అతనిపై జరుగుతున్న సీఐడీ దర్యాప్తు, రవిగుప్తా అనే అధికారి అతనికి ఛార్జ్ మెమో ఇవ్వడం, పొలాలకొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారంలో అతని ప్రమేయం వంటి వివరాలన్నీ తమ దృష్టికి వస్తున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం (TDP Government) లో ఏవో అవకతవకలు జరిగాయని, వాటిపై ఉన్నవి లేనివి చెప్పి చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), లోకేష్ (Lokesh) పేర్లు చెబితే ప్రమోషన్లు ఇప్పిస్తానని రఘురామిరెడ్డి సచివాలయంలోని ఉద్యోగుల్ని ప్రలోభపెడుతున్నది నిజంకాదా? అని వర్ల ప్రశ్నించారు.

ఎవరినీ వదిలేది లే...

వర్ల రామయ్య ఇంకా మాట్లాడుతూ... చట్టవిరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి (YCP Chief) మెప్పుకోసం ప్రతిపక్షనేతల్ని, ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న డీఐజీ రఘురామిరెడ్డిపై డీవోపీటీ (DOPT)కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా రఘురామిరెడ్డి చేతుల్లోనే ఉందని.. డీజీపీ (DGP) చేతిలో ఏంలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి రఘురామిరెడ్డి మంచి సన్నిహితుడని అధికారపార్టీ వారే చెబుతున్నారన్నారు. టీడీపీ నేత డూండీ రాకేశ్‌ను కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని నిలదీశారు. ఏంచేశాడని స్థానిక ఎస్సై అతన్ని లాగి చెంపపై కొట్టారని ప్రశ్నించారు. లోకేష్‌కు ఇవ్వడానికి హ్యండ్ మైక్ తీసుకెళ్తున్న బాషా అనే కుర్రాడిని రక్తం వచ్చేలా కొట్టమని పోలీసుల (Police)కు ఏచట్టం చెప్పిందని అడిగారు. ప్రతిపక్షాలపై చర్యలు తీసుకోవడానికి దొంగ కేసులు బనాయించవద్దని, లోకేష్ పాదయాత్ర (YuvaGalam Lokesh)పై విధ్వంసరచనలు చేయవద్దని, శాంతిభద్రతల విఘాతానికి ప్రధాన పాత్ర పోషించవద్దని డీఐజీ రఘురామిరెడ్డిని హెచ్చరించారు. రఘురామిరెడ్డి... తమరు తీసుకునే చర్యలే ఫైనల్ కాదని గుర్తుంచుకోవాలన్నారు. తప్పుచేసే అధికారులందరూ ఏదో ఒకనాడు తగిన మూల్యం చెల్లించుకుంటారని, పాదయాత్రలో ఓవరాక్షన్ చేసే పోలీసుల్ని వదిలేది లేదని వర్లరామయ్య (TDP Leader) మరోసారి హెచ్చరించారు.

Updated Date - 2023-02-09T15:42:29+05:30 IST