Devineni uma: జగన్ రెడ్డి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు

ABN , First Publish Date - 2023-10-11T16:00:05+05:30 IST

పిల్లల విషయంలో జగన్ రెడ్డి కంస మామ పాత్ర పోషిస్తున్నారు. 4 ఏళ్లలో ఒక గురుకుల పాఠశాలను నిర్మించారా?, పిచ్చోడు విశాఖపట్నం వెళ్తున్నారు కాబట్టి మంచోళ్లను విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థలను దెబ్బతిసే విధంగా జగన్ రెడ్డి కుట్రలకు

Devineni uma: జగన్ రెడ్డి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు

ఎన్టీఆర్ జిల్లా: జగన్ రెడ్డి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni uma) అన్నారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ మైలవరంలోని వినాయకుడి గుడిలో దేవినేని ఉమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. ‘‘పక్క రాష్ట్రంలోని ఎన్నికల్లో ఒక పార్టీకి సహకరించడానికి జగన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ లిటికేషన్‌లు క్రియేట్ చేస్తున్న జగన్ రెడ్డి. చంద్రబాబు రిమాండ్ పొడిగించడానికి వివిధ న్యాయస్థానాల్లో లిటికషన్లు మీద లిటికేషన్లు క్రియేట్ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ ఉన్నాయని, లేవని కోర్టు్ల్లో సాగదిస్తూ ఉద్దేశపూర్వకంగా పక్క రాష్ట్రం నాయకులతో కుమ్మక్కై అరాచకాలు చేస్తున్నారు.’’ అని మండిపడ్డారు.

‘‘పిల్లల విషయంలో జగన్ రెడ్డి కంస మామ పాత్ర పోషిస్తున్నారు. 4 ఏళ్లలో ఒక గురుకుల పాఠశాలను నిర్మించారా?, పిచ్చోడు విశాఖపట్నం వెళ్తున్నారు కాబట్టి మంచోళ్లను విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థలను దెబ్బతిసే విధంగా జగన్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నారు. ఇన్నర్ రింగు రోడ్డు మీద అవినీతి ఆరోపణలతో లోకేష్‌ను రెండు రోజులుగా సీఐడీ విచారణకు పిలిపించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కుట్రపూరితంగా, కక్ష పూరిత వైఖరితో విశాఖపట్నం వెళ్ళడానికి అమరావతిని చంపేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి లక్ష కోట్ల ఆస్తి పంపకాలను గాలికి వదిలేశారు. కృష్ణా జలాలను తాకట్టు పెట్టి కోర్టులకు వెళ్తానని డ్రామాలు మొదలు పెట్టారు. కృష్ణా జలాలపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్న లేవనెత్తినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా జగన్ రెడ్డి రైతాంగం గొంతు కోసేశారు. కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ ఆయకట్టు, రాయలసీమ రైతాంగం, నెల్లూరు రైతాంగాన్ని జగన్ రెడ్డి నట్టేట ముంచారు.’’ అని ధ్వజమెత్తారు.

Updated Date - 2023-10-11T16:01:30+05:30 IST