TDP - JANASENA: చంద్రబాబుతో పవన్ భేటీ.. ఏం చర్చించారంటే..?
ABN , First Publish Date - 2023-11-04T17:15:32+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అత్యవసరంగా భేటీ అయ్యారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) , జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో పవన్ కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరామర్శ అనంతరం రాజకీయాలపై చర్చించారు. చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు 3 గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. లోకేష్, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మరికొద్ది మంది కీలక నేతలతో తాజా రాజకీయాలపై చంద్రబాబు చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు ఏవిధంగా చేయాలో నేతలు చర్చించారు. సీఐడీ వరుసగా చంద్రబాబుపై పెడుతున్న కేసులపై కూడా చర్చించినట్లు సమాచారం. ఆంధ్ర, తెలంగాణ రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించారు. రెండు పక్షాలు కలిసి మేనిఫెస్టో విడుదల, క్షేత్ర స్థాయి పోరాటాలు వంటి అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ వైఖరిపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. బీజేపీ పార్టీతో భవిష్యత్‌లో ఎలా కలిసి ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు సమాచారం.