Balineni: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా
ABN , First Publish Date - 2023-02-01T16:33:51+05:30 IST
అది కాల్ రికార్డ్ మాత్రమే.. కాల్ రికార్డ్‌ను ట్యాపింగ్ అంటే ఎలా? అతని ఫ్రెండ్ కాల్ రికార్డ్ చేసి బయటికి పంపారు. ట్యాపింగ్ అని
ప్రకాశం: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ (Phone tapping)పై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అది కాల్ రికార్డ్ మాత్రమే.. కాల్ రికార్డ్‌ను ట్యాపింగ్ అంటే ఎలా? అతని ఫ్రెండ్ కాల్ రికార్డ్ చేసి బయటికి పంపారు. ట్యాపింగ్ అని నిరూపిస్తే... నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను. ఛాలెంజ్‌కి శ్రీధర్‌రెడ్డి సిద్ధమా? టీడీపీలోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే శ్రీధర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు (Chandrababu)ని శ్రీధర్ రెడ్డి హైదారాబాద్‌లో కలిసి మాట్లాడారు. ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy)కి ఎటువంటి భద్రత తగ్గించలేదు. ఆనం, శ్రీధర్ రెడ్డిలు టీడీపీకి ఎప్పటినుంచో టచ్‌లో ఉన్నారు. కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు.. శ్రీధర్ రెడ్డితో ఉన్న చనువుతో కాల్ రికార్డుపై ప్రశ్నించారు. అంత మాత్రానా బెదిరించడం కాదు.’’ అని చెప్పుకొచ్చారు.
సొంత పార్టీ వాళ్లే తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ (Ycp) నుంచి పోటీ చేయనని తెలిపారు. టీడీపీ (Tdp) నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ (AP)లో పొలిటికల్‌గా పెద్ద దుమారం రేపుతున్నాయి.