Somireddy: మంత్రి కాకాణి కనుసన్నల్లో మైనింగ్
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:55 PM
జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో ప్రతిరోజూ నాలుగు కోట్ల రూపాయల వైట్ ఖ్వార్జ్ తరలిస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) పేర్కొన్నారు.
నెల్లూరు: జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో ప్రతిరోజూ నాలుగు కోట్ల రూపాయల వైట్ ఖ్వార్జ్ తరలిస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) పేర్కొన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కనుసన్నల్లో మైనింగ్ జరుగుతుంది. అక్రమంగా మైనింగ్ జరుగుతున్నా సంబంధింత అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామానికి కొంత దూరంలో జిలిటెన్ స్టిక్స్‌తో పాటు పేలుడు పదార్థాలను సోమిరెడ్డి గుర్తించారు. బహిరంగంగా పేలుడు పదార్ధాలు నిల్వ చేసి ఉన్నా సంబందింత అధికారులు స్పందించడం లేదని అక్రమ మైనింగ్ నిలిపే వరకు సత్యాగ్రహం దీక్ష కొనసాగుతుంది’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు.