TDP: నారా లోకేష్ యువగళం పాదయాత్రకి అశేష ఆదరణ
ABN , First Publish Date - 2023-07-31T23:21:49+05:30 IST
నారా లోకేష్(Nara Lokesh) యువగళం(YUVAGALAM) పాదయాత్రకి అశేష ఆదరణ లభిస్తోంది.
ప్రకాశం(PRAKASHAM): నారా లోకేష్(Nara Lokesh) యువగళం(YUVAGALAM) పాదయాత్రకి అశేష ఆదరణ లభిస్తోంది. యువగళం ప్రభంజనంపై వైసీపీ సర్కారు(YCP Govt) మార్కు కుతంత్రాలు పన్నుతోంది.రోజు రోజుకూ పాదయాత్ర జనసంద్రం అవుతోంది. నారా లోకేష్‌ని చూడాలని, కరచాలనం చేయాలని జనం ఉత్సాహం చూపిస్తున్నారు.ఇదే అదనుగా పాదయాత్రలో తొక్కిసలాటలకి సర్కారు ప్లాన్ చేస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం పాదయాత్రలో పోలీస్ భద్రత(Police security) తగ్గించింది.ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువగళం పాదయాత్ర జనసంద్రం అవుతోంది. లోకేష్‌కి రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ(Police Department) విఫలమవుతోంది.
భద్రత కల్పించకుండా పోలీసులు చేతులు ఎత్తేస్తున్నారు. అడుగు తీసి అడుగు వేయలేయనంతగా పాదయాత్రలో కిక్కిరిసిన జనం ఉంటున్నారు.పోలీసులు ఎలాంటి భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో అక్కడక్కడ తోపులాటాలు జరుగుతున్నాయి. తోపులాటలో తరచుగా లోకేష్ చేతులు, కాళ్లకి గాయాలవుతున్నాయి. దర్శి నియోజకవర్గం పాదయాత్రలో జనం మీద పడటంతో లోకేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తోపులాటలో లోకేష్ మూడుసార్లు కింద పడే ప్రమాదం త్రుటిలో తప్పింపోయింది.
వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తంతో లోకేష్‌కి ప్రమాదం తప్పింది. క్రౌడ్ మ్యానేజ్మెంట్‌లో పోలీసులు తరచూ విఫలమవుతున్నారు.పోలీసులు కావాలనే నారా లోకేష్‌కి భద్రత కల్పించకుండా వదిలేస్తున్నారనే టీడీపీ శ్రేణులు, ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ పెద్దల ఒత్తిడి మేరకే లోకేష్ పాదయాత్రకి సెక్యూరిటీ తగ్గించారని టీడీపీ శ్రేణులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. కందుకూరు, గుంటూరు బాబు సభల్లో మాదిరిగానే ఏదో ఒక దుర్ఘటన జరిగేలా వైసీపీ ప్లాన్ చేస్తోందని టీడీపీ శ్రేణులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.