Koona Ravikumar: సీఐడీ రిమాండ్ రిపోర్ట్ తప్పుల తడక
ABN , First Publish Date - 2023-10-10T22:34:43+05:30 IST
జగన్ తన అవినీతిని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు కూడా అంటిచాలని కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూన రవికుమార్ (Kuna Ravikumar) ఎద్దేవ చేశారు. మంగళవారం
శ్రీకాకుళం: జగన్ తన అవినీతిని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు కూడా అంటిచాలని కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూన రవికుమార్(Kuna Ravikumar) ఎద్దేవ చేశారు. మంగళవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘లేని రింగు రోడ్డులో అవినీతి ఎలా జరుగుతుంది. ఏపీ ఫైబర్ నెట్‌ను 149 రూపాయల నుంచి 349 రూపాయలకు జగన్ పెంచాడు. ఫైబర్ గ్రిడ్ కోసం టీడీపీ ప్రభుత్వంలో 900 కోట్ల ఆదాయం వచ్చింది. చంద్రబాబు దేశానికి దిక్సూచి. జగన్ ప్రతి పథకంలోనూ అవినీతికి పాల్పడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లక్షలాదిమంది యువతకు ఉపాధి కల్పించాం. జగన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్‌ను నిర్వీర్యం చేశాడు. సీఐడీ చీఫ్ అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా పనికిరాడు.
చంద్రబాబు ఇమేజ్‌ను డామేజ్ చేయటానికి సీఐడీ చీఫ్ సంజయ్ దేశం మొత్తం తిరిగి ప్రెస్‌మీట్ పెడుతున్నాడు. జగన్ అసలు రంగు కేంద్రానికి అర్ధం అయ్యింది. మద్యం దోపిడినీ బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సీబీఐ విచారణ జరిపించాలని అమిత్ షాను అడిగారు. మద్యంలో 36 వేల కోట్లు దోపిడీ జరిగింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అడ్డగోలుగా అవినీతి చేశాడు. చంద్రబాబు బయటకు రాకూడదని జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు. మిగతా ముద్దాయిలకు బెయిల్ ఇచ్చి చంద్రబాబుకు ఎందుకు ఇవ్వరు. జగన్‌ను చూసి సమాజం అసహ్యించుకుంటుంది. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేడు. సొంత పార్టీ నేతలే జగన్ చర్యలను అసహ్యించుకుంటున్నారు. ‘‘బాబుతో నేను’’ అని ఇంటింటికీ వెళ్తాం. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ప్రజలకు వివరించి ప్రజా క్షేత్రంలోకి వెళ్తాం’’ అని కూన రవికుమర్ పేర్కొన్నారు.