Bandaru: భేటీతోనే జగన్‌కి బీపీ పెరిగింది.. ఇక ముందు ముందు..

ABN , First Publish Date - 2023-01-09T15:28:12+05:30 IST

చంద్రబాబు- పవన్ కల్యాణ్ భేటీతో తాడేపల్లిలో జగన్‌కి బీపీ పెరిగింది అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayana murthy) ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ముందు ముందు..

Bandaru: భేటీతోనే జగన్‌కి బీపీ పెరిగింది.. ఇక ముందు ముందు..
ఇక ముందు ముందు..

విశాఖ: చంద్రబాబు (Chandrababu)- పవన్ కల్యాణ్ (Pawan Kalyan)భేటీతో తాడేపల్లిలో జగన్‌కి బీపీ పెరిగింది అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayana murthy) ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ముందు ముందు.. బాహుబలులు చాలా మంది చంద్రబాబుని కలుస్తారు. అప్పుడు ఇంకా హార్ట్ ఎటాక్‌ (Heart attack)లు వస్తాయి. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు-పవన్ కలయికను కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వైసీపీ పాలనకు స్వస్తి చెప్పడానికి అన్ని పార్టీలు కలవాల్సిందే. రాష్ట్ర మంత్రులు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. భస్మాసురుని అంతం కోసం టీడీపీ ఎవరితోనైనా కలుస్తుంది. చంద్రబాబు-పవన్ ఇక చాలా సార్లు కలుస్తారు. అయినా మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? వైసీపీది జైలు పార్టీ. ఖేల్ ఖతం... దుకాణం బంద్. ప్రత్యేక హోదా కోసం జగన్ (cm jagan) ఢిల్లీలో పోరాడే దమ్ము ఉందా?. బాబాయ్‌ను చంపిందెవరో జగన్ చెప్పాలి.’’ అంటూ బండారు నిలదీశారు

Updated Date - 2023-01-09T15:37:52+05:30 IST