Bandaru Satyanarayana: జగన్ రుషికొండను నాశనం చేశారు
ABN , First Publish Date - 2023-12-02T15:59:11+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ( CM JAGAN ) రుషికొండను నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ( Bandaru Satyanarayanamurthy ) అన్నారు. శనివారం నాడు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖలో వ్యాపారం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వస్తున్నారని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ( CM JAGAN ) రుషికొండను నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ( Bandaru Satyanarayanamurthy ) అన్నారు. శనివారం నాడు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖలో వ్యాపారం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వస్తున్నారని అన్నారు. రుషికొండ విధ్వంసంపై వైసీపీ మినహా అందరూ పోరాటం చేస్తున్నారని అన్నారు. జగన్ కోసం 500 కోట్లు ప్రజాధనంతో రుషికొండలో విలసమైన భవనాలు నిర్మించారని చెప్పారు. జగన్ రుషికొండా చుట్టూ ఉన్నవారిని ఇబ్బందలు పెడుతున్నారని మండిపడ్డారు. రుషికొండా వద్ద ఉన్న హెలి టూరిజంను మూయించేశారని చెప్పారు. రుషికొండా వద్ద రెండు కిలోమీటర్ల మేర మత్య్సకారులు వేట చేయరాదని నిబంధనలు పెట్టారన్నారు. జగన్ పెద్ద అవినీతి రాజా అని ఎద్దేవ చేశారు. రుషికొండా విధ్వంసంపై జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై సమీక్ష కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విశాఖకు వస్తామంటున్నారని అన్నారు. విశాఖలో ఏం అభివృద్ధి చేశారో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. పర్యాటకులను, ప్రజలను ఇబ్బందులు పెడుతూ రుషికొండా వద్ద పెట్టిన నిబంధనలు వెంటనే తొలగించాలని బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు.