CPM Srinivasa Rao: ఏపీని మోదీ, జగన్ సర్వనాశనం చేస్తున్నారు

ABN , First Publish Date - 2023-10-05T19:38:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు(CPM Srinivasa Rao) ఆరోపించారు.

CPM Srinivasa Rao: ఏపీని మోదీ, జగన్ సర్వనాశనం చేస్తున్నారు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు(CPM Srinivasa Rao) ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద సీపీఎం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘‘ఉక్కు పరిశ్రమనే నడపలేని మోదీ... దేశాన్ని ఏం పాలిస్తారు? సీఎం జగన్ ఉక్కు పరిశ్రమను కాపాడతామని ..మాట ఇచ్చి మడమ తిప్పారు. ఉక్కు పరిశ్రమకు ఉరి వేయడానికి జగన్ బాధ్యత తీసుకున్నారా? సీఎం జగన్ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్‌పై జగన్ మౌనం పాటిస్తున్నారు. మీ వ్యక్తి గత ప్రయోజనాలకు...రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా? విశాఖలో సీఎం జగన్ నివాసం కావాలని ఎవరు అడిగారు?..ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి. జగన్ మీరు తాడేపల్లిలో ఉన్నా...విశాఖలో ఉన్నా ఒక్కటే.

విశాఖ ఉక్కు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మోదీ, కేంద్ర మంత్రులతో మాట్లాడారా? పవన్ ఒక చేతిని తెలుగుదేశం పార్టీతోనూ.. మరొక చేతిని బీజేపీతో ఉంచారు...ఆ రెండు చేతులు వదిలేసి ప్రజల చేతిని పవన్ కళ్యాణ్ పట్టుకోవాలి’’ అని సీపీఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-05T19:38:13+05:30 IST