Ganta Srinivasa Rao: వచ్చే ఎన్నికల్లో వంద శాతం అధికారంలోకి వచ్చేది టీడీపీనే
ABN , First Publish Date - 2023-08-04T16:13:52+05:30 IST
రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ విడుదల చేశాం. చంద్రబాబుకి పులివెందులలో అనూహ్య స్పందన వచ్చింది.. వై నాట్ పులివెందుల అంటున్నాం. పులివెందుల ప్రజలు కూడా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం అధికారంలోకి వచ్చేది టీడీపీనే..రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ విడుదల చేశాం. చంద్రబాబుకి పులివెందులలో అనూహ్య స్పందన వచ్చింది.. వై నాట్ పులివెందుల అంటున్నాం. పులివెందుల ప్రజలు కూడా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం అధికారంలోకి వచ్చేది టీడీపీనే..
విశాఖ: సాగునీటి ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ సందర్శన కోసం ఈనెల 8న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) విశాఖ వస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు (Ganta Srinivasa Rao) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ విడుదల చేశాం. చంద్రబాబుకి పులివెందులలో అనూహ్య స్పందన వచ్చింది.. వై నాట్ పులివెందుల అంటున్నాం. పులివెందుల ప్రజలు కూడా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వంద శాతం అధికారంలోకి వచ్చేది టీడీపీనే.. చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారు. ఆర్5 కోసం హడావిడి చేశారు. రాజధానిని పాడు చేయాలని చూశారు. కోర్టు అడ్డు చెప్పింది. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోవాలి. ప్రత్యేక హోదా కోసం జగన్ తానే మెడలు వంచారు. మహిళలకు టీడీపీ చేసిన మేలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మహిళలకు ఆర్థిక సాధికారత కావాలనే దీపం పథకం తెచ్చాం. అమ్మ ఒడిని (Amma odi) నమ్మి ప్రజలు ఓట్లు వేశారు.. కానీ జగన్ (Cm jagan) మాట తప్పారు.. సగం మందికే ఇచ్చారు. హామీలు 98.5 శాతం నెరవేర్చామని జగన్ కొత్త రకం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పథకాలు 98.5 శాతం కూడా అమలు కాలేదు. నవరత్నాల్లో ఏ ఒక్క రత్నాన్నైనా వంద శాతం అమలు చేశారా? వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు.. ఇప్పుడు ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. రాజధాని లేకుండా చేశారు. పోలవరం తూట్లు పొడిచారు.. మద్యపాన నిషేధం ఎక్కడ అమలు చేశారు? జాబ్ కేలండర్ ఏమైంది..? ఒక్క డీఎస్సీ లేదు.. మండలానికి కోల్డ్ స్టేరేజ్ ఇస్తామన్నారు. చివరి ఏడాదిలో శంకుస్థాపనలు చేస్తున్నారు. నాలుగున్నర ఏళ్లలో ఏ ఒక్క దాన్నైనా ప్రారంభించారా?.’’ అని గంటా ప్రభుత్వాన్ని నిలదీశారు.