Gantasrinivas rao: పవన్ అంత దారుణమైన వ్యాఖ్యలు ఏం చేశారు?.. పరువ నష్టం కేసుపై గంటా ట్వీట్

ABN , First Publish Date - 2023-07-22T10:49:56+05:30 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రభుత్వం పరువు నష్టం కేసు వేడయంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ట్వీట్టర్ వేదికగా స్పందించారు.

Gantasrinivas rao: పవన్ అంత దారుణమైన వ్యాఖ్యలు ఏం చేశారు?.. పరువ నష్టం కేసుపై గంటా ట్వీట్

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ( Janasena Chief Pawan Kalyan) ప్రభుత్వం పరువు నష్టం కేసు వేడయంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు (Former Ganta Srinivasrao) ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవన్‌పై పరువు నష్టం కేసు వేయడానికి ఆయన మీ పరువుకు నష్టం వాటిల్లే దారుణమైన వ్యాఖ్యలు ఏం చేశారు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. ‘‘గడిచిన నలుగన్నారేళ్లలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మీరు ఏమి పరువు మిగిల్చారో చెప్పండి జగన్ గారు..?. రాజధాని ఎదో చెప్పుకోలేక, పరిశ్రమలు లేక ఉద్యోగాల కోసం పరాయి రాష్ట్రాలకు వెళుతున్న దుస్థితికి తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రజలు అవమానంతో వెయ్యాలి మీ మీద పరువు నష్టం. ప్రత్యేక హోదా తెస్తామని గొప్పలు చెప్పి ఢిల్లీకి వెళ్లి తలదించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచనకు గురి చేసినందుకు మీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెయ్యాలి పరువు నష్టం. అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఇప్పుడు లిక్కర్ సేల్స్ పెంచి.. లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయంతో 25 సంవత్సరాల పాటు రిపేమెంట్ చేస్తామని బ్యాంకర్లకు చెప్పి 25 వేల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చుకున్నారు. మీ మాటలు నమ్మి దగా పడ్డ తెలుగింటి ఆడపడుచులు వెయ్యాలి మీ మీద పరువు నష్టం. 62 ఏళ్ళుగా మచ్చలేని చరిత్ర కలిగిన మార్గదర్శి అంతా చట్టబద్ధమని కోర్టు తీర్పునిచ్చి మీకు మొట్టికాయలు వేసింది.. మీరు రాజకీయ కక్షతో వేధింపులకు గురైన మార్గదర్శి కస్టమర్లు వెయ్యాలి మీద పరువు నష్టం. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.3 వేలకు పెంచుతామని చెప్పి మీ మాటలకు మోసపోయిన అవ్వ, తాతలు, మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్న అవ్వ, తాతల వెయ్యాలి మీద పరువు నష్టం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కానీ.. ఒక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఒక పోలీస్‌ రిక్రూట్‌మెంట్ లేక ఆశతో ఎదురు చూపులు చూస్తూ మోసపోయిన నిరుద్యోగులు వెయాలి పరువు నష్టం దావా’’ అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.

Updated Date - 2023-07-22T10:49:56+05:30 IST