Ganta Srinivasa Rao: రుషికొండ బీచ్‌కు ఎంట్రీ టిక్కెట్లపై ఆగ్రహం

ABN , First Publish Date - 2023-07-08T18:12:28+05:30 IST

జగన్ ప్రభుత్వం(jagan govt) రుషికొండ బీచ్‌(Rushikonda Beach )కు ఎంట్రీ టిక్కెట్లు పెట్టడంపై తెలుగుదేశం నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ట్విట్టర్‌(Twitter)లో ఆగ్రహం చేశారు. ‘

Ganta Srinivasa Rao:  రుషికొండ బీచ్‌కు  ఎంట్రీ టిక్కెట్లపై ఆగ్రహం

విశాఖ: జగన్ ప్రభుత్వం(jagan govt) రుషికొండ బీచ్‌(Rushikonda Beach )కు ఎంట్రీ టిక్కెట్లు పెట్టడంపై తెలుగుదేశం నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ట్విట్టర్‌(Twitter)లో ఆగ్రహం చేశారు. ‘‘వైజాగ్‌లో తాకట్టు పెట్టాలకున్నవన్నీ పెట్టేశారు... అమ్మలనుకున్నవన్నీ అమ్మేశారూ..... కూల్చాలనుకున్నవన్నీ కూల్చేశారు...వెయ్యాలనుకున్న పన్నులన్నీ వేసేశారు.ఇప్పుడేమో బీచ్‌ల వద్ద పార్కింగ్ ఫీజులు, ఎంట్రీ ఫీజులు. వైజాగ్ అంటే అందమైన బీచ్‌లు గుర్తుకొస్తాయి, సముద్రతీరంలో కాసేపు సేదదీరితే ఒత్తిడి తగ్గుతోందని విశాఖ వాసులు సాయంత్రం అలా బీచ్‌కు వెళ్తుంటారుఇకపై 'బ్లూ' ఫాగ్ గా గుర్తింపు ఉన్న రుషికొండ బీచ్‌కు వెళ్లాలంటే 20 రూపాయల ఎంట్రీ ఫీజు పెట్టడంతో ప్రకృతి ప్రేమికుల నుంచి తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీచ్‌ల వద్ద పార్కింగ్ రుసుం కింద ద్విచక్ర వాహనాలకు రూ. 10, కార్లకు రూ.30, బస్సులకు రూ.50 వసూలు జరుగుతోంది. ఇప్పుడేమో బీచ్‌లోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజ్... తీరం అందాలు ఆస్వాదించడానికి ప్రభుత్వమే అధునాతన హంగులతో బీచ్‌‌లను అభివృద్ధి చేసి పర్యాటకులను నగరవాసులను ఆకట్టుకోవాల్సింది పోయి.. ఎంట్రీ ఫీజులు పెట్టి పర్యాటకుల నడ్డి విరుస్తున్నారు. ప్రభుత్వం ఈ ఎంట్రీ టిక్కెట్లపై వెంటనే పునరాలోచన చేయాలి’’ అని ట్విట్టర్‌లో గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు.

4eb56bc3-1252-488c-a0d5-f68765d9697c.jpg

Updated Date - 2023-07-08T20:21:38+05:30 IST