KA Paul: గతంలో ఎన్టీఆర్ తెలుగు వాడి సత్తా కేంద్రానికి చూపించాడు
ABN , First Publish Date - 2023-10-07T16:29:55+05:30 IST
గతంలో ఎన్టీఆర్ తెలుగు వాడి సత్తా కేంద్రానికి చూపించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్( KA Paul) వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం: గతంలో ఎన్టీఆర్ తెలుగు వాడి సత్తా కేంద్రానికి చూపించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్( KA Paul) వ్యాఖ్యానించారు. శనివారం నాడు విశాఖలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను, తాత్కాలికంగా నిలుపుదల చేయడంలో విజయం సాధించాం. ఢిల్లీ వెళ్లి పర్మినెంట్‌గా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించాలని కోరాం. ఇప్పుడు ఎన్టీఆర్ లాగా బీజేపీకి కూడా తెలుగువారి సత్తా మరోసారి చూపించాం. జగన్, చంద్రబాబు ఎవరు విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి పోరాడలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడు లేకపోతున్నారు. మన రాష్ట్రంలో మనం కలిసి ఉంటే.. మోదీ స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేవారు. బీజేపీ పాలసీలకి మాత్రమే నేను వ్యతిరేకం... వ్యక్తులకు కాదు’’ అని కేఏ పాల్ పేర్కొన్నారు.