Ganta srinivas rao: వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే
ABN , First Publish Date - 2023-10-06T16:15:40+05:30 IST
దమ్ముంటే వైసీపీ నేతలు డేట్, ప్లేస్ ఫిక్స్ చేయండి. చర్చకు మేము రెడీ. పార్టీకి వచ్చిన ఎలక్ట్రోల్ బాండ్లను కూడా లంచం, అవినీతి అంటున్నారు. వైసీపీకి వచ్చిన విరాళాల సంగతి ఏమిటి?
విశాఖ: చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) వైసీపీ చేసిన అతి పెద్ద తప్పు.. వైసీపీ మరణ శాసనం తానే రాసుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta srinivas rao) వ్యాఖ్యానించారు. నక్కవానిపాలెంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణుల నిరసన చేపట్టారు. గంటా పాల్గొని మాట్లాడారు. ‘‘ఏపీలో ఏ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో అవినీతి జరిగిందో చూపించాలని వైసీపీకి (Ycp Government) సవాల్ విసురుతున్నా. దమ్ముంటే వైసీపీ నేతలు డేట్, ప్లేస్ ఫిక్స్ చేయండి. చర్చకు మేము రెడీ. పార్టీకి వచ్చిన ఎలక్ట్రోల్ బాండ్లను కూడా లంచం, అవినీతి అంటున్నారు. వైసీపీకి వచ్చిన విరాళాల సంగతి ఏమిటి?, ఇదే స్కిల్ డెవెలప్‌మెంట్ సెంటర్ల మీద అవార్డ్ తెచ్చుకుని జగన్ సర్కార్ (Cm jagan) పబ్లిసిటీ ఇచ్చింది. వైసీపీ తాత్కాలికంగా పై చెయ్యి కావచ్చు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. బాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. కష్ట కాలంలో అండగా నిలిచిన మిత్రుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). టీడీపీ, జనసేన కూటమి చూసి వైసీపీ కంటగింపుగా ఉంది. ఎవరికి ఎన్ని సీట్లో అది మా అంతర్గత వ్యవహారం. వైసీపీ దుకాణం బంద్ అయ్యింది. వచ్చేది టీడీపీ- జనసేన కూటమిదే విజయం.’’ అని గంటా ఆశాభావం వ్యక్తం చేశారు