Ganta srinivasa rao: చంద్రబాబుకు వచ్చిన ఆదరణ చూసి వైసీపీలో వణుకు
ABN , First Publish Date - 2023-11-02T15:56:13+05:30 IST
చంద్రబాబుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
విశాఖ: సీఎం జగన్‌కు (CM Jagan) కేవలం 3 నెలలు సమయం మాత్రమే ఉందని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు (Ganta srinivasa rao) జోస్యం చెప్పారు. గంటా మీడియాతో మాట్లాడారు. ‘‘బెయిల్‌పై చంద్రబాబు (Chandrababu) విడుదల తర్వాత రాజమండ్రి నుంచి చంద్రబాబు నివాసానికి రావడానికి 14 గంటల సమయం పట్టింది. 180 కిలోమీటర్లు 2 గంటలకు చేరుకుంటాం... కానీ వేలది మంది రావడంతో చాలా ఆలస్యం అయింది. నిజమైన నాయకుడికి ప్రజల నుంచి నిజమైన అభినందనలు వచ్చాయి. హైదరాబాద్‌కు చంద్రబాబు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.
‘‘చంద్రబాబుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కంటి డాక్టర్ ఒకే రోజు రెండు రిపోర్ట్‌లు ఇచ్చారంటే... వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో అర్థము అవుతుంది. లోకేష్ (Nara lokesh) ఢిల్లీకి వెళ్తే మీకు ఎందుకు ఉలుకు?, చంద్రబాబు 14 గంటల ప్రయాణం చేశారు.. కారు నుంచి బయటకు రాలేదు.. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు. మద్యపాన నిషేధంపై జగన్ మాట తప్పారు. ఏపీలో మద్యం స్కాం జరుగుతోందని పురంధేశ్వరి కూడా అంటున్నారు. మద్యం కంపెనీలు, షాపులు అన్నీ వైసీపీ, సలహాదారులు, సామంత రాజులవి. చంద్రబాబుపై కేసుల బలం లేకపోవడంపై. .. సీఐడీ కొత్తగా మద్యం కేసులు పెడుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ బస్సు యాత్రలు అన్నీ తుస్సే. అన్ని విషయంలో జగన్ మాట తప్పి.. మడం తిప్పారు. మోదీకి (Pm modi) మసాజ్ చేస్తున్నారు.’’ అని గంటా విమర్శించారు.