TNSF Chief: చంద్రబాబుకు వైఎస్ భారతీరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి: ప్రణవ్ గోపాల్

ABN , First Publish Date - 2023-04-18T12:33:15+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత నారాసుర రక్తచరిత్ర అని సీఎం వైఎస్ జగన్ రెడ్డి తన ‘‘అసాక్షి’’ పత్రికలో విషప్రచారం చేశారని ...

TNSF Chief: చంద్రబాబుకు వైఎస్ భారతీరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి: ప్రణవ్ గోపాల్

విశాఖపట్నం: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య (YS Viveka Murder Case) తర్వాత నారాసుర రక్తచరిత్ర అని సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CN YS Jaganmohan Reddy) తన ‘‘అసాక్షి’’ పత్రికలో విషప్రచారం చేశారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (TNSF State Chief Pranav Gopal) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. నేడు సీబీఐ విచారణలో హంతకుల జాబితాలో మొత్తం జగన్ కుటుంబ సభ్యులే ఉన్నారన్నారు. జగన్ చిన్నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిందని తెలిపారు. జగన్ తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు ఆమడ దూరంలో ఉన్నారని... సీబీఐ విచారణకు జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్, భారతీరెడ్డి పీఏ నవీన్ వెళ్లివచ్చారన్నారు.

వివేకా హత్యకు సంబంధించిన రక్తపు మరకలు, ఆనవాళ్లు తాడేపల్లి నుంచి పులివెందుల వరకు సీబీఐకి కనిపించాయని.. దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్‌మీట్ పెడుతున్నారని ప్రశ్నించారు. నాడు నారాసుర రక్తచరిత్ర అని రాసిన సాక్షి పత్రిక డైరెక్టర్ భారతీరెడ్డి.. చంద్రబాబుకు, టీడీపీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పత్రికలో అయితే తాటికాయంత అక్షరాలతో నారాసుర రక్తచరిత్ర అని అచ్చు వేశారో...అ దే పత్రికలో బహిరంగ క్షమాపణలు చెబుతూ వార్త ప్రచురించాలని డిమాండ్ చేస్తున్నామని ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-18T12:33:15+05:30 IST