TDP: మంత్రి కారుమూరిని ఎర్రిపప్ప అన్న టీడీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-06-29T13:45:02+05:30 IST

మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

TDP: మంత్రి కారుమూరిని ఎర్రిపప్ప అన్న టీడీపీ ఎమ్మెల్యే

పశ్చిమగోదావరి: మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై (Minister Karumuri Nageshwar rao) పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Palakollu MLA Nimmala Ramanaidu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎర్రిపప్ప మంత్రి అంటూ టీడీపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం అమ్మకంలో రైతులు ఎదురు డబ్బులు కడితే గానీ రైస్ మిల్లర్లు ధాన్యం దించుకోలేదని.. బస్తాకు 10 కేజీలు అదనంగా దోచేశారని ఆరోపించారు. ఇవన్నీ చూస్తూ ఊరుకున్న.. ఎర్రిపప్ప మంత్రి ఎవరో, సన్నాసి ఎవరో, వెదవో ఏవరో చెప్పాలన్నారు. అన్నం తినే వాడివి అయితే రైతు కష్టం విలువ తెలిసిన వాడివి అయితే ఇలా మాట్లాడి ఉండరని వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో నీవు చక్రవర్తివని గుర్తించి నీకు జగన్ మంత్రి పదవి కట్టబెట్టారన్నారు. తణుకు మునిసిపాలిటీలో టీడీఆర్ బాండ్లు పేరిట కారుమూరి రూ.300 కోట్లు అక్రమార్జన చేశారని ఆరోపించారు. ‘‘చించినాడ దళిత భూముల్లో తవ్విన మట్టి ఎక్కడెక్కడికి పోయిందో నువ్వు నాతో వస్తే గ్రామ గ్రామం తిప్పి చూపిస్తా. ఎర్రిపప్ప మంత్రి ఎప్పటికైనా నిజాలు గ్రహించి మాట్లాడితే మంచిది’’ అంటూ నిమ్మల రామానాయుడు హితవుపలికారు.

The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-06-29T13:45:27+05:30 IST