BJP Vs DMK : అమిత్ షా పర్యటన.. చెన్నై వీథుల్లో అంధకారం..

ABN , First Publish Date - 2023-06-11T11:20:30+05:30 IST

కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా చెన్నై పర్యటన కరంట్ కష్టాలతో మొదలైంది. శనివారం రాత్రి

BJP Vs DMK : అమిత్ షా పర్యటన.. చెన్నై వీథుల్లో అంధకారం..
Amit Shah

చెన్నై : కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా (Amit Shah) చెన్నై పర్యటన కరంట్ కష్టాలతో మొదలైంది. శనివారం రాత్రి ఆయన చెన్నై విమానాశ్రయంలో దిగేసరికి ఈ పరిసరాల్లోని వీథుల్లో కరంట్ పోవడంతో చీకట్లు అలముకున్నాయి. ఇది బీజేపీ (BJP), డీఎంకే (DMK) మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. కేంద్ర హోం మంత్రి పర్యటనలో కరంట్ పోవడం భద్రతా లోపమేనని, దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు. డీఎంకే ప్రభుత్వానికి, విద్యుత్తు శాఖ మంత్రి సెంథిల్ బాలాజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎంకే స్పందిస్తూ బీజేపీ రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టింది.

డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ (TKS Elangovan) మాట్లాడుతూ, కరంటు కోత ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదన్నారు. కరంట్ పోవడం పట్ల బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. ఎండ వేడి వల్ల విద్యుత్తు వినియోగం బాగా పెరిగిందన్నారు. అప్పుడప్పుడూ కరంట్ పోతూ ఉంటుందన్నారు. దీనిపై బీజేపీ సీబీఐ చేత దర్యాప్తు చేయించవచ్చునన్నారు. దీనిపై ఆ పార్టీ రాజకీయాలు చేస్తోందన్నారు.

విద్యుత్తు బోర్డు అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, 230కేవీ హైటెన్షన్ సరఫరా లైన్ గ్రిడ్ నుంచి డిస్కనెక్ట్ అయిందని, కరంట్ పోవడానికి కారణం అదేనని తెలుస్తోంది. విమానాశ్రయం పరిసర ప్రాంతాలతోపాటు పోరూర్, సెయింట్ థామస్ మౌంట్, పూనమల్లీ, దాని పరిసరాల్లో కూడా శనివారం రాత్రి 9.30 గంటల నుంచి 10.12 గంటల వరకు కరంట్ పోయింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్తు లైన్ మరమ్మతులు కొనసాగుతున్నాయి.

అమిత్ షా గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో భాగంగా శనివారం రాత్రి చెన్నై నగరానికి చేరుకున్నారు. ఆయన ఆదివారం వెల్లూరు సమీపంలోని పల్లికొండలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ వెళ్తారు.

ఇవి కూడా చదవండి :

Wrestlers : ఆధారాలివ్వండి : ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరిన ఢిల్లీ పోలీసులు

Congress : కాంగ్రెస్‌కు అంతు చిక్కని సచిన్ పైలట్ వ్యవహారం

Updated Date - 2023-06-11T11:20:30+05:30 IST