Lok sabha Elections 2024: కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యలుగా తృణమూల్, ఆప్‌

ABN , First Publish Date - 2023-02-22T21:26:49+05:30 IST

తమ దారిలోకి ఆప్, తృణమూల్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు.

Lok sabha Elections 2024: కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యలుగా తృణమూల్, ఆప్‌
TMC, AAP

న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections 2024) సమీపిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తే ప్రధానమంత్రి (Prime Minister of India) నరేంద్ర మోదీ (Narendra Modi) సారధ్యంలోని బీజేపీ(BJP)ని ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చని కాంగ్రెస్ (Congress) ప్రతిపక్షాలకు, ప్రాంతీయపార్టీలకు నచ్చచెబుతోంది. అయితే పశ్చిమబెంగాల్ అధినేత్రి సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్(TMC), అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కొరకరాని కొయ్యలుగా మారుతున్నాయి. తమ దారిలోకి ఆప్, తృణమూల్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు.

స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తృణమూల్ అధినాయకత్వాన్ని తప్పుబట్టారు. బీజేపీకి మేలు చేసేందుకే కాంగ్రెస్‌తో చేతులు కలపడం లేదని ఆరోపించారు. తాజాగా చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాగేల్ కూడా తృణమూల్, ఆప్ పార్టీల నాయకత్వాలను విమర్శిస్తున్నారు. బీజేపీకి మేలు చేసేందుకు తాపత్రాయపడుతున్నారని బాగేల్ ఆరోపించారు. ఒక్కసారిగా విమర్శలు పెరిగిపోవడంతో తృణమూల్, ఆప్ పార్టీల నాయకత్వాల్లో మార్పు వస్తుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌తో జత కలిసేందుకు తృణమూల్, ఆప్ ఆసక్తి కనపరచడం లేదు.

Updated Date - 2023-02-22T21:28:29+05:30 IST