Uttar Pradesh : ముస్లింల మద్దతు కోసం కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ

ABN , First Publish Date - 2023-04-05T18:16:34+05:30 IST

2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని ముస్లింల మద్దతు కోసం కరపత్రాలతో

Uttar Pradesh : ముస్లింల మద్దతు కోసం కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ
Congress Flags

న్యూఢిల్లీ : 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని ముస్లింల మద్దతు కోసం కరపత్రాలతో ప్రచారం ప్రారంభించింది. సమాజ్‌వాదీ పార్టీ (SP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లకు మద్దతివ్వడం వల్ల బీజేపీ (BJP) బలపడుతోందని, బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కొనగలిగే సత్తా తమకు మాత్రమే ఉందని చెప్తోంది.

గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ కరపత్రాలను ప్రచురించింది. మైనారిటీలు అధికంగా ఉన్న పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పరిస్థితులను వివరించింది.

ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఇన్‌ఛార్జి షానవాజ్ ఆలం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ సందేశాన్ని వ్యాపింపజేసేందుకు దాదాపు 1,500 మైనారిటీ డామినేటెడ్ విలేజెస్‌లో ప్రచారం చేశామని చెప్పారు. గతంలో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ ఈ ప్రచారం చేస్తున్నామన్నారు. ముస్లింలు ఎస్పీకి కానీ, బీఎస్పీకి కానీ ఓటు వేస్తే, ఇతర కులాలవారు ఆ పార్టీలకు ఓటు వేయడం లేదని చెప్పామన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ మధ్య బలమైన పొత్తు ఉన్నప్పటికీ, దళితులు ఎస్పీకి ఓటు వేయలేదని, వెనుకబడిన వర్గాలవారు బీఎస్పీకి ఓటు వేయలేదని చెప్పినట్లు తెలిపారు.

కేంద్రంలో కాంగ్రెస్ బలంగా ఉన్నపుడు బీజేపీ బలహీనపడిన విషయాన్ని కూడా తాము ముస్లింలకు వివరించామన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఓటు వేయడం వల్ల బీజేపీ బలపడుతోందని చెప్పినట్లు తెలిపారు. దీంతో బీఎస్పీ, ఎస్పీ లేదా ఆర్ఎల్‌డీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని ముస్లింలు తెలుసుకున్నారని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Supreme Court : మీడియా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

CBI oppositions: 14 విపక్ష పార్టీలకు సుప్రీంకోర్టులో షాక్!.. ఇంతకీ విషయం ఏంటంటే...

Updated Date - 2023-04-05T18:16:34+05:30 IST