Delhi Liquor Policy Case : కేజ్రీవాల్‌కు ఈడీ భారీ షాక్

ABN , First Publish Date - 2023-02-23T12:46:04+05:30 IST

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) దూకుడు పెంచింది.

Delhi Liquor Policy Case : కేజ్రీవాల్‌కు ఈడీ భారీ షాక్
Arvind Kejriwal

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) దూకుడు పెంచింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వ్యక్తిగత సహాయకునికి సమన్లు జారీ చేసింది.

ఈ కేసులో విచారణకు ఆదివారం (ఈ నెల 26) హాజరుకావాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia)ను సీబీఐ (Central Bureau of Investigation) కోరిన సంగతి తెలిసిందే. ఈ విచారణకు తాను హాజరవుతానని సిసోడియా ప్రకటించారు. ఆయనను సీబీఐ గత ఏడాది అక్టోబరు 17న ప్రశ్నించింది.

కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మద్యం విధానంపై ఆరోపణలు రావడంతో దానిని ఉపసంహరించింది. అయితే ఈ విధానం అమలై ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చి ఉండేదని, కోట్లాది రూపాయల ఆదాయ నష్టం జరగడానికి కారణం లెఫ్టినెంట్ గవర్నర్ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. సీబీఐని సిసోడియా వెంటాడేలా లెఫ్టినెంట్ గవర్నర్ చేయడం వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తోంది.

బీజేపీ స్పందిస్తూ, మనీశ్ సిసోడియా నేతృత్వంలోని ఎక్సయిజ్ శాఖలో అవినీతిని కప్పిపుచ్చేందుకే నూతన విధానాన్ని ఉపసంహరించి, పాత విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారని ఆరోపించింది.

బీఆర్ఎస్ నేత కే కవిత వద్ద చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేసిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ ఇటీవల ఈ కేసులో అరెస్ట్ చేసింది. అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా రెడ్డి, బినయ్ బాబులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి :

China : చైనాను కుదిపేసిన భారీ భూకంపం

Congress : కాంగ్రెస్‌కు భారీ షాక్... అత్యంత కీలక నేత రాజీనామా...

Updated Date - 2023-02-23T12:46:07+05:30 IST