Budget20234: బడ్జెట్ వచ్చేసింది.. హైలెట్స్ ఇవే..
ABN , First Publish Date - 2023-02-01T12:16:18+05:30 IST
ఎన్నో ఆశలు, అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్ 2023-24ను (Union Budget2023-24) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 2023-24 ఏడాదికి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, ప్రణాళికలు, లక్ష్యాలతో కూడిన ఆర్థిక పత్రాన్ని సమర్పించారు. నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు ఇవే..
న్యూఢిల్లీ: ఎన్నో ఆశలు, అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్ 2023-24ను (Union Budget2023-24) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 2023-24 ఏడాదికి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, ప్రణాళికలు, లక్ష్యాలతో కూడిన ఆర్థిక పత్రాన్ని సమర్పించారు. నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు ఇవే..
హైలెట్స్..
- 1 కోటి మంది రైతులను ప్రకృతి సాగు దిశగా ప్రోత్సహించడం
- గోబర్‌ధాన్ స్కీమ్ కింద 500 నూతన వ్యర్థాల (Waste) నుంచి వెల్త్ ప్లాంట్స్ (Wealth plants) ఏర్పాటు.
- రూ.19,700 కోట్లతో నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు.
- బడ్జెట్‌లో రహిత వృద్ధిపై (Green Growth) దృష్టి.
- 5జీ వినియోగానికి అవసరమైన యాప్స్ రూపొందించేందుకు 100 ల్యాబ్స్ ఏర్పాటు..
- ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం.
- నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్‌కు రూ.19,700 కోట్లు కేటాయింపు.
- విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు.
- దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణం.
- 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌లు.
- కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం.
- నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ.
- ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7వేల కోట్లు కేటాయింపు.
- వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు.
- వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్.
- చిరువ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి.
-విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు.
-దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణం.
- 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌లు.
- కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం.
- నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ.
- ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7వేల కోట్లు కేటాయింపు.
- వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు.
- వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్.
- చిరువ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి.
- గిరిజన మిషన్ కోసం రూ.10వేల కోట్లు: నిర్మల.
- ఏడాదికి అర్బన్ ఇన్ ఫ్రా ఫండ్ కోసం రూ.10వేల కోట్లు.
- రూ.75వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన.
- ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డు పాన్ నెంబర్.
- మేన్ ఇన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.
- ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయింపు.
-రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు.
- రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు.
- వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు.
- బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయింపు.
- పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు.
- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరింత ప్రోత్సాహం.
- గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు.
- ప్రాంతీయ భాషల్లో NBT ద్వారా మరిన్ని పుస్తకాలు.
- ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం.
- PMAY కోసం రూ.79వేల కోట్లు కేటాయింపు.
- దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలతో పాటు 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు.
- మహిళా సాధికారత దిశగా భారత్ కృషి.
- హరిత ఇంధనం కోసం ప్రత్యేక చర్యలు
-వ్యవసాయ రంగానికి రుణ, మార్కెటింగ్ సదుపాయం.
- గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత.
- దేశవ్యాప్తంగా 11.7కోట్ల టాయిలెట్స్ నిర్మాణం.
- 2047 లక్ష్యంగా పథకాలు రూపకల్పన.