America : భారత్ శక్తిమంతమైన, జీవచైతన్యంగల ప్రజాస్వామిక దేశం : అమెరికా

ABN , First Publish Date - 2023-06-06T09:11:13+05:30 IST

భారత దేశంలో ప్రజాస్వామ్యం గురించి వ్యక్తమయ్యే ఆందోళనను అమెరికా తోసిపుచ్చింది. భారత దేశం శక్తిమంతమైన, జీవచైతన్యంగల ప్రజాస్వామిక దేశమని, న్యూఢిల్లీ వెళ్లినవారు ఎవరైనా ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకోగలరని శ్వేత సౌధం

America : భారత్ శక్తిమంతమైన, జీవచైతన్యంగల ప్రజాస్వామిక దేశం : అమెరికా
John Kirby

వాషింగ్టన్ : భారత దేశంలో ప్రజాస్వామ్యం గురించి వ్యక్తమయ్యే ఆందోళనను అమెరికా తోసిపుచ్చింది. భారత దేశం శక్తిమంతమైన, జీవచైతన్యంగల ప్రజాస్వామిక దేశమని, న్యూఢిల్లీ వెళ్లినవారు ఎవరైనా ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకోగలరని శ్వేత సౌధం (White House) చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇటువంటి సమయంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది.

శ్వేత సౌధంలో జాతీయ భద్రతా మండలిలో స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ సమన్వయకర్త జాన్ కిర్బీ (John Kirby) సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, భారత దేశం (India) శక్తిమంతమైన, జీవచైతన్యంగల ప్రజాస్వామిక దేశమని చెప్పారు. న్యూఢిల్లీ వెళ్లేవారు ఎవరైనా ఈ విషయాన్ని తమంతట తాము తెలుసుకోగలుగుతారన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థల శక్తి, సామర్థ్యాలు, వాటి పనితీరు చర్చలో భాగమవుతుందన్నారు.

ఓ ప్రశ్నకు సమాధానంగా జాన్ కిర్బీ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎవరితోనైనా మనకు ఇబ్బందులు ఉన్నపుడు ఆందోళన వ్యక్తం చేయకుండా తాము తప్పించుకోబోమన్నారు. అయితే ఈ పర్యటన ప్రస్తుత స్నేహపూర్వక, భాగస్వామ్య సంబంధాలను మరింత లోతుగా, గాఢంగా, బలంగా అభివృద్ధి చేసుకోవడం కోసమేనని చెప్పారు. అనేక స్థాయుల్లో భారత దేశం అమెరికాకు బలమైన భాగస్వామి అని తెలిపారు. షాంఘ్రి లా డిపెన్స్ సమ్మిట్‌లో అమెరికా సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఆస్టిన్ లాయిడ్ కొన్ని అదనపు రక్షణ సహకారాలను ప్రకటించారని, ఇప్పుడు వాటి అమలుకు భారత దేశంతో కలిసి పని చేస్తామని చెప్పారు. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక రంగంలో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. ఇండో-పసిఫిక్ భద్రతకు సంబంధించి భారత దేశం పసిఫిక్ క్వాడ్ మెంబర్, కీలకమైన మిత్రుడు, భాగస్వామి అని తెలిపారు.

ఇలా తాను చెప్పుకుంటూ పోతే చాలా చాలా చెప్పగలనని తెలిపారు. భారత దేశం చాలా ముఖ్యమైనదని చెప్పడానికి లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయన్నారు. కేవలం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల కోసం మాత్రమే కాకుండా, అనేక స్థాయుల్లో బహుముఖంగా భారత దేశం చాలా ముఖ్యమైనదని వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు రావాలని, ఈ అంశాలన్నిటి గురించి ఆయనతో మాట్లాడాలని, భాగస్వామ్యం, స్నేహాలను మరింత పెంచుకోవాలని, మరింత లోతుగా అభివృద్ధి చేసుకోవాలని దేశాధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఎదురు చూస్తున్నారని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Governor: గవర్నర్‌ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Summer holidays: మళ్లీ వేసవి సెలవుల పొడిగింపు

Updated Date - 2023-06-06T09:11:13+05:30 IST