Share News

Piyush Goyals: తెలంగాణ ఎన్నికల ఫలితంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అంచనా ఇదే..

ABN , First Publish Date - 2023-11-17T17:33:01+05:30 IST

ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ స్వదేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలపై ఓ కన్నేసి ఉంచారు. సదస్సు విరామ సమయంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి బీజేపీ అంచనాలను ఆయన పంచుకున్నారు.

Piyush Goyals: తెలంగాణ ఎన్నికల ఫలితంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అంచనా ఇదే..

న్యూయార్క్: ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ స్వదేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలపై ఓ కన్నేసి ఉంచారు. సదస్సు విరామ సమయంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి బీజేపీ అంచనాలను ఆయన పంచుకున్నారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో బీజేపీ ఏకపక్ష విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో అన్ని పార్టీల కంటే బీజేపీ ముందు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. మిజోరం విషయంలో స్పష్టతలేదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో తిరిగి బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటుందని పేర్కొన్నారు. కాగా.. ఒపీనియన్ పోల్స్, రాజకీయ విశ్లేషకుల అంచనాలను ఆయన తప్పుబట్టారు. రాజస్థాన్‌లో బీజేపీ గెలుస్తుందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ఓడిపోతుందని పేర్కొన్న ఒపీనియన్ పోల్స్‌‌ను ఆయన కొట్టిపారేశారు. ఈ అంచనాలు క్షేత్రస్థాయికి తగ్గట్టులేవని అభిప్రాయపడ్డారు.


క్షేత్రస్థాయి పరిస్థితులు, టీవీలు, ‘ఎక్స్’లను గమనిస్తే ఛత్తీస్‌గఢ్‌లో గాలి మారిందని, కాంగ్రెస్ కంటే బీజేపీ స్పష్టంగా ముందు ఉందని అన్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో తాను అమెరికా బయలుదేరడానికి ముందే అక్కడ పరిస్థితులు మారిపోయాయని, బీజేపీ గెలుపు గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో విస్తృతంగా తిరిగానని, అక్కడ వార్ వన్‌సైడేనని అభివర్ణించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు బీజేపీ విజయాల కోసం సంసిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

తెలంగాణలో పరిస్థితిపై గోయల్ అభిప్రాయమిదే

తెలంగాణలో పరిస్థితి ఏంటనేది ఇండియా వచ్చాక చూస్తానని పీయూష్ గోయెల్ అన్నారు. తెలంగాణ ఎన్నిక నవంబర్ 30న జరగనుందని, అమెరికా వెళ్లడానికి ముందు తెలంగాణలో రెండు సార్లు మాత్రమే పర్యటించానని అన్నారు. తిరిగి భారత్ చేరుకున్నాక క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటన్నది అంచనా వేస్తానని పేర్కొన్నారు. క్షేత్రస్థాయలో ఏం జరుగుతోందనేది వాస్తవంగా అర్థమవుతుందని అన్నారు.

Updated Date - 2023-11-17T17:33:18+05:30 IST