Wrestlers Protest : బ్రిజ్ భూషణ్‌పై దర్యాప్తు.. శరద్ పవార్ వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2023-06-07T14:35:46+05:30 IST

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు చేసిన ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభమవడం పట్ల ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్

Wrestlers Protest : బ్రిజ్ భూషణ్‌పై దర్యాప్తు.. శరద్ పవార్ వ్యాఖ్యలు..

ముంబై : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)పై రెజ్లర్లు చేసిన ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభమవడం పట్ల ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ (NCP chief Sharad Pawar) సంతృప్తి వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న రెజ్లర్లు ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని, మొదట దర్యాప్తు చేస్తామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం అంటోందని అన్నారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన తమను లైంగికంగా వేధించారని, బెదిరించారని ఆరోపిస్తూ, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల మేరకు బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కొందరు డబ్ల్యూఎఫ్ఐ సిబ్బందిని కూడా పోలీసులు ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. బ్రిజ్ భూషణ్ ఢిల్లీ నివాసంలో పని చేస్తున్నవారిని కూడా పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం స్పందించింది. అమిత్ షా శనివారం బజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవర్త్ కడియన్ తదితర రెజ్లర్లతో సమావేశమయ్యారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం స్పందించి రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించారు. రెజ్లర్లు సానుకూలంగా స్పందించి, చర్చల కోసం ఆయన నివాసానికి వెళ్లారు.

ఈ నేపథ్యంలో శరద్ పవార్ విలేకర్లతో మాట్లాడుతూ, బ్రిజ్ భూషణ్‌పై దర్యాప్తు ప్రారంభమవడం సంతృప్తికరమని చెప్పారు. కొందరు ఎన్‌సీపీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని విలేకర్లు ప్రస్తావించినపుడు పవార్ మాట్లాడుతూ, అది తమకు ఆందోళన కలిగించే విషయం కాదన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రవేశించడాన్ని పట్టించుకోకుండా ఉండకూడదని, ఆ పార్టీ ఏం చేయగలదో వేచి చూద్దామని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Odisha Train Accident : డబ్బు కోసం ఇంత దారుణమా? ఒడిశా రైలు ప్రమాద మృతుల శవాలతో మోసాలు!

Air India plane : మగడాన్ విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయులు.. ఇది బంగారు నిక్షేపాలున్న పట్టణం!..

Updated Date - 2023-06-07T14:35:46+05:30 IST