RRR: ఆస్కార్ వేళ మరో ఘనత
ABN , First Publish Date - 2023-03-13T19:41:26+05:30 IST
‘నాటు నాటు’ (Naatu Naatu) పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో (best original song oscar 2023) ఆస్కార్ అవార్డును (Oscar Award) కైవసం చేసుకున్న వేళ మరో ఘనతను సాధించింది.
భువనేశ్వర్: 95వ అకాడమీ అవార్డ్స్ (95th Academy Awards)లో జక్కన్న (Jakkanna) చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో (best original song oscar 2023) ఆస్కార్ అవార్డును (Oscar Award) కైవసం చేసుకున్న వేళ మరో ఘనతను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఒడిశా రవాణా శాఖ వినూత్నంగా ఆలోచించింది. ‘నాటు నాటు’ పాట ఆధారంగా క్యాంపెయిన్ ప్రారంభించింది.
నో టు నో టు డ్రంక్ డ్రైవింగ్
నో టు నో టు మొబైల్ వైల్ డ్రైవింగ్
నో టు నో టు ఓవర్ స్పీడింగ్ అనే థీమ్‌లను విడుదల చేసింది.
ఆర్ఆర్ఆర్ అంటే రెస్పాన్సిబుల్ రోడ్ రైడ్స్ అంటూ నిర్వచనం ఇచ్చింది. గమ్యస్థానాలకు రెస్పాన్సిబుల్ రోడ్ రైడ్స్ సురక్షితంగా చేరుస్తాయని హ్యాష్‌టాగ్ పెట్టింది.
ఒడిశా రవాణా శాఖ ప్రయోగానికి అనూహ్య స్పందన వస్తోంది. ‘నాటు నాటు’ పాటకున్న ఆదరణతో జనంలోకి సందేశాలను తీసుకెళ్లగలుగుతున్నారు. ఒడిశా రవాణా శాఖ తరహాలోనే మిగతా అనేక సంస్థలు ఈ పాట పాపులారిటీని వాడుకునేందుకు యత్నిస్తున్నాయి.
లాస్‌ఏంజెల్స్‌లో నేడు కీరవాణి (Keeravani), చంద్రబోస్ (Chandrabose) ‘ఆస్కార్’ అవార్డును అందుకున్నారు. దీంతో దేశం సత్తా చాటేలా మీసం మెలేసిన రాజమౌళి అండ్ టీమ్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. ఇండియన్ సినిమా గర్వపడేలా చరిత్ర సృష్టించిన రాజమౌళి (SS Rajamouli), ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ను అంతా ప్రశంసిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్‌ను అందుకున్న RRRకు డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli). మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి (MM Keeravani). లిరిక్ రైటర్ చంద్రబోస్ (Chandra Bose). గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్.