Delhi Police: పార్లమెంట్ భద్రతా బాధ్యతలు ఢిల్లీ పోలీసులకు బదిలీ
ABN , Publish Date - Dec 21 , 2023 | 03:34 PM
పార్లమెంట్ భద్రతా బాధ్యతలను కేంద్ర హోం శాఖ ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసింది. పార్లమెంట్‌లో దాడి నేపథ్యంలో భద్రత బదలాయింపుకు కేంద్ర హోం శాఖ చర్యలు తీసుకుంది. పార్లమెంట్ భద్రత, అగ్నిమాపక వ్యవహారాలనను ఇప్పటివరకు CRPF చూస్తోంది.
ఢిల్లీ : పార్లమెంట్ భద్రతా బాధ్యతలను కేంద్ర హోం శాఖ ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసింది. పార్లమెంట్‌లో దాడి నేపథ్యంలో భద్రత బదలాయింపుకు కేంద్ర హోం శాఖ చర్యలు తీసుకుంది. పార్లమెంట్ భద్రత, అగ్నిమాపక వ్యవహారాలనను ఇప్పటివరకు CRPF చూస్తోంది. పార్లమెంట్ వింటర్ సెషన్‌లో భద్రతా లోపాలతో కేంద్రం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే భద్రత, అగ్నిమాపక చర్యలపై సర్వే నిర్వహించాలని పారిశ్రామిక భద్రతా దళం డీజీని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆదేశించింది. రోజువారీ భద్రతా పర్యవేక్షణకు సంబంధించిన సిబ్బంది మోహరింపుపై సర్వే చేయాలని కేంద్రం పేర్కొంది. సర్వే తర్వాత స్పీకర్‌తో చర్చించి భద్రతను తమ అధీనంలోకి CISF తీసుకోనున్నట్లు తెలుస్తోంది.