Karnataka Polls : మా అన్నయ్య దగ్గర నేర్చుకోండి మోదీ గారూ! : ప్రియాంక గాంధీ వాద్రా
ABN , First Publish Date - 2023-04-30T17:25:36+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా (Congress leader Priyanka Gandhi
బెంగళూరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా (Congress leader Priyanka Gandhi Vadra) ఆదివారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనను కాంగ్రెస్ 91సార్లు తిట్టిందని మోదీ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ (BJP) తిట్టిన తిట్ల జాబితాను కాంగ్రెస్ (Congress) తయారు చేస్తే, ఆ తిట్లతో అనేక పుస్తకాలు తయారవుతాయన్నారు.
కర్ణాటక (Karnataka) శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం ప్రియాంక గాంధీ వాద్రా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం ఆమె జమ్‌ఖండీలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తనను తిడుతున్నారని బహిరంగంగా చెప్పుకునే ప్రధాన మంత్రిని తాను తొలిసారి చూస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రజల బాధలను వినడానికి బదులుగా, ఆయనే తన కష్టాలను చెప్పుకుంటున్నారన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో ఎవరో ఆయనను తిట్టిన తిట్ల జాబితాను రూపొందించారని, ప్రజల సమస్యలకు సంబంధించిన జాబితాను రూపొందించలేదని అన్నారు. ఎన్నిసార్లు ఆయనను తిట్టారో జాబితా రాశారన్నారు. ఆ జాబితా ఓ పేజీకి సరిపోయిందని, గాంధీ కుటుంబంపై బీజేపీ తిట్టిన తిట్ల జాబితాను తయారు చేయడం ప్రారంభిస్తే, అనేక పుస్తకాలు రాయవచ్చునని చెప్పారు.
ఈ దేశం కోసం తాను దూషణలను, తూటాలను స్వీకరించడానికి సిద్ధమని తన సోదరుడు రాహుల్ చెప్తున్నారని ప్రియాంక అన్నారు. తిట్లు, అవమానాలు, తూటాలకు భయపడకుండా సత్యం కోసం ఎల్లప్పుడూ నిలుస్తానని రాహుల్ చెప్తున్నారన్నారు. ధైర్యం చేసి తన సోదరుని దగ్గర నేర్చుకోవాలని మోదీని ప్రియాంక కోరారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికలు మే 10న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. తానే ముఖ్యమంత్రినవుతానని జ్యోతిష్కుడొకరు చెప్పారని జేడీఎస్ నేత హెచ్‌డీ కుమార స్వామి చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Mann Ki Baat : ‘మన్ కీ బాత్’పై బిల్ గేట్స్ స్పందన
Mann Ki Baat : ఇతరుల మంచి లక్షణాలను ఆరాధిస్తా : ‘మన్ కీ బాత్’లో మోదీ