Rahul Gandhi : పొలంలో దిగి, నాట్లు వేసి, రైతులతో ఆత్మీయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2023-07-08T09:26:24+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. శనివారం ఉదయం ఆయన హర్యానాలోని సోనీపట్ సమీపంలోని మదీనా గ్రామంలో పొలంలో దిగి, రైతులతో కలగలిసిపోయి, వరి నాట్లు వేశారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. శనివారం ఉదయం ఆయన హర్యానాలోని సోనీపట్ సమీపంలోని మదీనా గ్రామంలో పొలంలో దిగి, రైతులతో కలగలిసిపోయి, వరి నాట్లు వేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రాహుల్ గాంధీ శనివారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ వెళ్తూ మార్గమధ్యంలో మదీనా గ్రామంలో పొలాల్లో పని చేసుకునేవారిని చూశారు. వెంటనే కారును ఆపి, పొలంలో దిగి, ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. ఆ తర్వాత తన ప్యాంటును మోకాళ్ల పై వరకు మడిచి, పొలంలోకి దిగారు. రైతులు వరినాట్లు వేస్తున్న విధానాన్ని పరిశీలించి, తాను కూడా కొన్ని వరి మొక్కలను తీసుకుని, నాటారు. అనంతరం అక్కడి రైతులతోనూ, కూలీలతోనూ ఆయన మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాలవారితోనూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆయన సమాజంలోని వివిధ వర్గాలవారితో ముచ్చటిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వారితో ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీలోని బైక్ మెకానిక్ వర్క్‌షాపునకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Chief Minister: గృహిణులకు ప్రతినెలా రూ.1000 పథకం..