Opposition Meeting Updates: ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరిన సోనియా, రాహుల్..
ABN , First Publish Date - 2023-07-17T12:07:32+05:30 IST
నేడు, రేపు బెంగళూరులో జరగనున్న విపక్షాల సమావేశంలో పాల్గొనడానికి కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాసేపటి క్రితం ఢిల్లీలోని తమ నివాసం నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం వరకు వారు బెంగళూరు చేరుకోనున్నారు. సోనియా, రాహుల్ గాంధీనే కాకుండా సమావేశంలో పాల్గొనే ఇతర విపక్ష నేతలు కూడా మధ్యాహ్నం వరకు బెంగళూరుకు చేరుకోనున్నారు.
బెంగళూరు: నేడు, రేపు బెంగళూరులో జరగనున్న విపక్షాల సమావేశంలో పాల్గొనడానికి కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాసేపటి క్రితం ఢిల్లీలోని తమ నివాసం నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం వరకు వారు బెంగళూరు చేరుకోనున్నారు. సోనియా, రాహుల్ గాంధీనే కాకుండా సమావేశంలో పాల్గొనే ఇతర విపక్ష నేతలు కూడా మధ్యాహ్నం వరకు బెంగళూరుకు చేరుకోనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంతి డీకే శివకుమార్ మీటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు. కాగా ఈ సమావేశం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. 6 గంటల తర్వాత అనాధికార సమావేశం జరగనుంది. రాత్రి 8 గంటలకు డిన్నర్ కార్యక్రమం ఉంటుంది.
నేడు రేపు జరగనున్న ఈ సమావేశంలో 26 విపక్ష పార్టీలు పాల్గొంటున్నట్లు సమాచారం అందుతోంది. మొదటిసారిగా గత నెల 23న బిహార్‌లో విపక్షాల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. బిహార్ సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. తాజాగా బెంగళూరులో జరిగే సమావేశంలో బిహార్ సమావేశంలో పాల్గొనని ఆర్‌ఎల్‌డీ, ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ తదితర పార్టీలు పాల్గొంటున్నాయి. ఈ సమావేశానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరు కానున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమెకు శనివారం స్వయంగా ఫోన్ చేసి, సోమవారం జరిపే విందుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే.. ఆమె తన కాలి గాయం కారణంగా ఆమె నేరుగా సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. కాగా, కర్ణాటక సీఎం సిద్దరామయ్య సోమవారం నిర్వహించే విందులో అనధికారిక చర్చలు జరుగుతాయి. మంగళవారం విస్తృత చర్చల తర్వాత నేతలంతా కలిసికట్టుగా విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. తమ కూటమికి ప్రత్యేక పేరును నిర్ణయించడంతో పాటు.. భవిష్యత్‌లో వివిధ రాష్ట్రాల్లో కలిసికట్టుగా ర్యాలీలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారు.