Stalin: బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే దర్యాప్తు సంస్థల దాడులు: ఎంకే స్టాలిన్

ABN , First Publish Date - 2023-10-05T14:36:10+05:30 IST

కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష ఇండియా(INDIA Alliance) కూటమి సభ్యులపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ఆరోపించారు.

Stalin: బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే దర్యాప్తు సంస్థల దాడులు: ఎంకే స్టాలిన్

చెన్నై: కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష ఇండియా(INDIA Alliance) కూటమి సభ్యులపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ఆరోపించారు. డీఎంకే ఎంపీ జగత్రక్షకన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) ఇళ్లపై ఐటీ సోదాలు(IT Raids) చేస్తున్న తరుణంలో సీఎం స్పందించారు. డీఎంకే ఎంపీకి చెందిన ఆఫీసులు, నివాసాల్లో కలిపి 40 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆప్(AAP) ఎంపీ సంజయ్ సింగ్ కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ అనంతరం ఆయన్ని అదుపులో తీసుకోవడాన్ని ప్రశ్నిస్తూ స్టాలిన్ ఎక్స్(X)లో పోస్ట్ చేశారు.


'బీజేపీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు అవధులు లేవు! ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను అరెస్టు చేయడం, డీఎంకే ఎంపీ జగత్రక్షకన్ ఇంటిపై దాడి చేయడం ఇండియా కూటమి నాయకులపై కక్ష కట్టి రాజకీయ ప్రయోజనాల కోసం స్వతంత్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేశారనడానికి ఉదాహరణలు. ప్రతిపక్ష పార్టీల మధ్య పెరుగుతున్న ఐక్యతపట్ల బీజేపీ భయపడుతోంది. వారు మంత్రగత్తె వేట(దర్యాప్తు సంస్థలు) ఆపేసి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి' అని స్టాలిన్ అన్నారు.

Updated Date - 2023-10-05T14:36:10+05:30 IST