Indian Students: భారతీయ విద్యార్థుల టాప్-5 గమ్యస్థానాలు ఇవే..!
ABN , First Publish Date - 2023-09-08T11:22:48+05:30 IST
గత ఐదేళ్లలో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) తాజాగా డేటా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం గత ఐదేళ్లలో మొత్తం 10.30లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్.. స్టడీ వీసాల (Study Visas) పై విదేశాలకు వెళ్లారు.
ఎన్నారై డెస్క్: గత ఐదేళ్లలో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) తాజాగా డేటా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం గత ఐదేళ్లలో మొత్తం 10.30లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్.. స్టడీ వీసాల (Study Visas) పై విదేశాలకు వెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా 79 దేశాలలో మన విద్యార్థులు చదువుతున్నట్లు డేటా ద్వారా తెలిసింది. ఇక భారతీయ విద్యార్థుల (Indian Students) టాప్-5 గమ్యస్థానాలు వచ్చేసి అమెరికా, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా. యూఎస్‌కు అత్యధికంగా 4,65,791 మంది వెళ్లగా.. ఆ తర్వాత వరుసగా కెనడా (1,83,310), యూఏఈ (1,64,000), ఆస్ట్రేలియా (1,00,009), సౌదీ (65,800) ఉన్నాయి.
"2017 నుంచి 2022 వరకు ఐదేళ్ల వ్యవధిలో విదేశాల్లో సుమారు 1.3 మిలియన్ల మంది భారతీయ విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరారు. మనోళ్లు అమితాసక్తి చూపిస్తున్న ఐదు దేశాలు మాత్రం అమెరికా, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా. అయితే, విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు చేసే ఖర్చులకు సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ ఎటువంటి డేటాను నిర్వహించడం లేదు" అని మంత్రి సుభాష్ సర్కార్ చెప్పారు. గత నెలలో రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు.
NRI: ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ..!