NRI: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కువైత్‌లో టీడీపీ, జనసేన ఎన్నారై నేతల నిరసన
ABN , First Publish Date - 2023-09-30T09:20:49+05:30 IST
ఎన్నారై తెలుగుదేశం కువైత్, జనసేన కువైత్ సంయుక్త ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ తలకు నల్లక్లాత్ను కట్టుకుని నిరసన చేస్తూ చంద్రబాబు సంఘీభావం తెలియజేశారు.
NRI: ఎన్నారై తెలుగుదేశం కువైత్, జనసేన కువైత్ సంయుక్త ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ తలకు నల్లక్లాత్ను కట్టుకుని నిరసన చేస్తూ చంద్రబాబు సంఘీభావం తెలియజేశారు. కువైత్‌లో ఫర్వానియా ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో పాటు జనసేన నాయకులు, జనసైనికులు హాజరై చంద్రబాబును ప్రభుత్వం వెంటనే విడుదల చేయలని కోరారు. సుప్రీం కోర్టులో అక్టోబరు మూడవ తారీఖున జరగనున్న విచారణలో న్యాయం గెలిచి చంద్రబాబు కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని భగవంతుణ్ణి వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ నాయకులు సుధాకర రావు కుదరవల్లి, నాగేంద్రబాబు అక్కిలి, మద్దిన ఈశ్వర్ నాయుడు, వీసీ సుబ్బారెడ్డి, షేక్ బాషా, దుగ్గి శ్రీను, గాజులపల్లి సుబ్బా రెడ్డి, మహేష్, సుబ్బరాజు, చామర్తి వెంకట రామరాజు, చిన్నా రాజు, నూతేటి సబ్బనరసింహులు, రవి చంద్రా రెడ్డి, చిన్న బాబు గునపాటి, రాము, మహాసేన రాజేష్ రాపాక.. జనసేన నాయకులు రామచంద్ర నాయక్, కాంచన శ్రీకాంత్ బాబు, అంజన్ కుమార్ పగడాల, ఓబులేసు, వెంకటెష్, దండు చంద్ర శేఖర్, ప్రేమ రాయల్, కొమ్మినేని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.