NCBN Arrest : ఢిల్లీలో చినబాబు.. ఏపీలో బాలయ్య బాబు ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. వణికిపోతున్న వైసీపీ!

ABN , First Publish Date - 2023-09-23T15:31:08+05:30 IST

అవును.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, యువనేత నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరే వినిపిస్తోంది. టీవీ చానెల్స్ పెడితే ఈ ఇద్దరే.. జనాలు ఏ ఇద్దరు పోగయినా ఇదే చర్చ..

NCBN Arrest : ఢిల్లీలో చినబాబు.. ఏపీలో బాలయ్య బాబు ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. వణికిపోతున్న వైసీపీ!

అవును.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, యువనేత నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరే వినిపిస్తోంది. టీవీ చానెల్స్ పెడితే ఈ ఇద్దరే.. జనాలు ఏ ఇద్దరు పోగయినా ఇదే చర్చ.. ఇక సోషల్ మీడియాలో అయితే అబ్బో అంతకు మించి చర్చ, రచ్చ కూడా!. ఎందుకింతలా మామా-అల్లుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్ అవుతున్నారు..? అసలేం జరిగింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.


Babu-Balayya-Lokesh.jpg

ఇదీ అసలు కథ..!

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసును బనాయించి టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాబును ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలని ఆయన తరఫు లాయర్లు అటు ఏసీబీ.. ఇటు హైకోర్టు.. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర స్థాయిలో పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో అని దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లడం జరిగింది. కచ్చితంగా న్యాయం జరుగుతుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం రెండ్రోజుల సీఐడీ విచారణను చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. బాబు అరెస్టయిన మరుక్షణం నుంచి లోకేష్, బాలయ్య ఇద్దరూ రంగంలోకి దిగిపోయారు. ఇక్కడ ఏపీలో మామ, అక్కడ ఢిల్లీలో లోకేష్ ఇద్దరూ ఇద్దరే.. చక్రం తిప్పుతున్నారు.

Balayya-and-Lokesh.jpg

చినబాబు రేంజ్ ఇదీ..!

బాబు అక్రమ అరెస్ట్ తర్వాత లోకేష్.. తాను ప్రతిష్టాత్మక చేపట్టిన యువగళం పాదయాత్రను ఉన్నఫలంగా ఆపేసి నాన్నకోసం బాధ్యతగా బయటికొచ్చారు. ఒకట్రెండురోజులు ఏపీలో చేయాల్సినవన్నీ దగ్గరుండి చూసుకున్న లోకేష్.. ఇక హస్తినలో మకాం వేశారు. కేసులో బాబు తరఫున వాదించడానికి లండన్‌కు చెందిన హరీష్ సాల్వే లాంటి పెద్ద పెద్ద లాయర్లతో మంతనాలు జరపడం, న్యాయ నిపుణులతో సలహాలు, సూచనలు తీసుకోవడం లాంటివి చేశారు. ఇక ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో.. టీడీపీ లోక్‌సభ సభ్యులతో సమావేశం కావడం, పార్లమెంట్ వేదికగా వైసీపీ తీరును ఎలా ఎండగట్టాలనేదానిపై దిశానిర్దేశం చేశారు. చినబాబు చెప్పినట్లుగానే అక్షరాలా ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ ఎంపీలతా తూ.చ తప్పకుండా పాటించారు. ఇవన్నీ మనం పార్లమెంట్ సాక్షిగా జగన్ సర్కార్ తీరును ఎండగట్టి దేశమంతా చర్చకు వచ్చేలా గట్టిగా పోరాటం చేశారు. ఆఖరికి ఇక్కడ కూడా వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, మార్గాని భరత్ లాంటివారు అడ్డుపడ్డారంటే వారి విజ్ఞతకే వదిలేయాలి మరి. ఇక జాతీయస్థాయిలో ప్రముఖంగా ఉన్న రిపబ్లిక్ టీవీతో పాటు మరికొన్ని చానెళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడం.. అసలు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి..? ఎంత మంది దీనివల్ల ప్రయోజకులయ్యారు..? కుంభకోణంగా మారిందన్న విషయంలో నిజానిజాలెంత..? అనేది దేశానికి అర్థమయ్యేలా క్లియర్ కట్‌గా చెప్పారు చినబాబు. ‘నాన్నకు ప్రేమతో’ అంటూ.. అకారణంగా అక్రమ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న తండ్రిని బయటికి తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారో చూశారు కదా.! ఒకటా రెండా.. సెప్టెంబర్-15 నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు. ఆఖరికి లోకేష్‌ను అక్రమ కేసులో ఇరికించాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత నాలుగైదు రోజులుగా సీఐడీ అధికారులు హస్తినలోనే చినబాబు కోసం తిష్ట వేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Lokesh-Delhi.jpg

వైసీపీని వణికిస్తున్న బాలయ్య!

బాలయ్య తన బావ చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఎలాంటి పాత్ర పోషించారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటు అల్లుడి ఢిల్లీలో చూసుకుంటే.. ఇటు మామ రాష్ట్ర స్థాయిలో పార్టీ వ్యవహారాలు, పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్యాడర్‌కు ధైర్యం చెబుతూ వచ్చారు బాలయ్య. పార్టీ ముఖ్యనేతలతో నేరుగా ప్రధాన కార్యాలయంలో సమావేశం కావడంలో సలహాలు, సూచనలు తీసుకున్నాక.. బాలకృష్ణ దిశానిర్దేశం చేశారు. ఇక ములాఖత్ మొదలుకుని ప్రెస్‌మీట్‌లు పెట్టడం.. ఆయన మాట్లాడిన ఒక్కో మాట తూటాల్లో వైసీపీ పెద్దలకు గుచ్చుకోవడం, ఇక యుద్ధమే.. క్యాడర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించడం పెను సంచలనమే అని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క మాటే వైసీపీకి మింగునపడలేదు. అందుకే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం ఆలస్యం బాలయ్యను రెచ్చగొట్టడం ఆయన్ను ఆగ్రహానికి గురిచేయడం లాంటివి చేశారు వైసీపీ సభ్యులు. ఇక తగ్గేదే లేదే అంటూ బాలయ్య మీసాలు తిప్పడం లాంటివి చేయాల్సి వచ్చింది. అంతేకాదు.. బాబు స్థానంలోనే అసెంబ్లీలో కూర్చొని పార్టీకి పెద్దన్నగా వ్యవహరించారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీకి అన్నీ తానై.. బావ స్థానాన్ని భర్తీ చేశారని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. బావను బయటికి తీసుకురావడానికి.. బావ కళ్లలో ఆనందం చూడటానికి ఏదైనా చేయడానికి బాలయ్య సిద్ధంగానే ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. దీంతో బాలయ్యే నంబర్-02 అని కొన్ని మెయిన్ స్ట్రీడ్ మీడియాల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడం విశేషమే. ఇదీ బాలయ్య బాబు.. ఇక్కడ రాష్ట్రంలో చక్కబెట్టిన కార్యక్రమాలు.

మొత్తానికి చూస్తే.. అక్కడ చినబాబు, ఇక్కడ బాలయ్య బాబు.. వైసీపీ వెన్నులో వణుకు పుట్టించారని టీడీపీ చెప్పుకుంటోంది. మున్ముందు మామా-అల్లుడు ఇంకేమేం కార్యక్రమాలు చేపడుతారో..? అప్పుడింకా వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.

Balayya-assembly.jpg


ఇవి కూడా చదవండి


NCBN CID Enquiry : చంద్రబాబు సీఐడీ విచారణతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పరిస్థితి ఎలా ఉందో చూడండి


CBN CID Custody : చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభం.. గంట గంటకూ ఇలా..


Lokesh Delhi Tour : హుటాహుటిన హస్తినకు లోకేష్.. ఏపీలో మారిన సీన్.. ఏం జరగబోతోంది..?


Updated Date - 2023-09-24T17:48:13+05:30 IST