Botsa Video Viral : అడ్డంగా బుక్కైన బొత్స.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. కంగుతిన్న వైసీపీ.. మంత్రి ఏం చేశారో తెలిస్తే.. !

ABN , First Publish Date - 2023-04-09T16:39:27+05:30 IST

అవును.. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (AP Minister Botsa Satyanarayana) అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాను (Social Media) బాగా వాడుకోండని..

Botsa Video Viral : అడ్డంగా బుక్కైన బొత్స.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. కంగుతిన్న వైసీపీ.. మంత్రి ఏం చేశారో తెలిస్తే.. !

అవును.. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (AP Minister Botsa Satyanarayana) అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాను (Social Media) బాగా వాడుకోండని.. చాలా యాక్టివ్‌గా ఉండాలని ఏప్రిల్-3న (April-3) జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో పదే పదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చెబితే.. అదే సోషల్ మీడియాకు మంత్రి (Minister) దొరికిపోయారు. బాబోయ్.. ఆ వీడియోలోని (Botsa Video) మాటలు గానీ మీరు విన్నారో బొత్స ఇంత ఫ్రస్టేషన్‌తో ఉన్నారేంటో అని అవాక్కవుతారేమో. ప్రస్తుతం నెట్టింట్లో బొత్స వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. వీడియోలో ఆయన అన్న మాటలను విన్న సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా ఈయన ఒక్కరే కాదండోయ్.. ఏప్రిల్-3 నుంచి చాలా మంది మంత్రులు, ఇక ఎమ్మెల్యేలు అయితే లెక్కలేనంత మంది బుక్కయిపోయారు. ఇంతకీ బొత్స ఏం మాట్లాడారు..? ఏ సందర్భంలో ఆయన ఇలా మాట్లాడాల్సి వచ్చిందనే విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Botsa-Satya-Narayana.jpg

అసలేం జరిగిందంటే..!

మంత్రి బొత్స ఇప్పుడు విజయనగరంలో పర్యటిస్తున్నారు. మంత్రిగారొచ్చారు కదా తమ సమస్యలు చెబితే పరిష్కరిస్తారని స్థానిక నేతలు భావించారు. ఒకరిద్దరు సమస్యలు చెప్పగా ఆయన కాస్త పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యారు. అనంతరం ఒకరిద్దరు శృంగవరపుకోట (Srungavarapukota) నేతలు ఏకంగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు (MLA Kadubandi Srinivasa Rao) పైనే ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అసలు సమస్య ఏంటో కనీసం వినకుండానే ఒక్కసారిగా మంత్రి రెచ్చిపోయారు. ‘ఏంట్రా.. నీ బాధ.. యూజ్‌లెస్ ఫెలో’ అంటూ బొత్స ఊగిపోయారు. ‘హేయ్.. ఉంటే ఉండు లేకుంటే పో.. ఏం తమాషాలు చేస్తున్నావా..?. ఏం మాట్లాడుతున్నావ్.. హా ఏం మాట్లాడుతున్నావ్.. నీకేమైనా అర్థం అవుతోందా లేదా..? అర్థం చేసుకో సరేనా’ అంటూ తన నోటికి పనిచెప్పారు మంత్రి. అవతలి వ్యక్తి..‘ అది కాదు సార్ మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాం’ అని చెప్పినప్పటికీ మంత్రి మాత్రం అస్సలు ఆయన పట్టించుకుంటే ఒట్టు. ‘ అసలేంట్రా.. నీ బాధ.. బాధలు నీకేనా మాకు ఉండవా..? అడిగేవాళ్లు లేరని తమాషాలు చేస్తున్నావా..? ఉంటే ఉండు లేకుంటే పో.. (వేలి చూపించి హెచ్చరిస్తూ) యూజ్‌లెస్ ఫెలో. ఒక్కొక్కరికి పెరిగిపోతోంది.. అంతా చూస్తున్నా.. ఇలానే ప్రవర్తించేంది. నువ్వేం పోటుగాడివి అనుకున్నావా.. వీళ్లందరికీ (అక్కడనున్న నాయకులను చూపిస్తూ) రాజకీయాలు చేయడానికి రాదా.. లేకుంటే చేతకాదా..?. హేయ్.. ఎవరక్కడ కెమెరాలు తీయ్.. ఎందుకు వీడియో తీస్తున్నావ్..’ అని బొత్స ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఒకానొక సందర్భంలో కారు దిగి.. ఆ నేతను కొట్టేంతలా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. మంత్రి బొత్స- వైసీపీ నేత మధ్య జరిగిన ఈ రచ్చ తాలుకూ వీడియోను చూసిన పార్టీ శ్రేణులు కంగుతిన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

YSRCP.jpg

ఎందుకింత ఫ్రస్టేషన్!

మంత్రి గానీ.. ఎమ్మెల్యే గానీ నియోజకవర్గానికి వచ్చారంటే కార్యకర్తలు, నేతలు తమ సమస్యలు పరిష్కరించాలని అడగటం మామూలే. ఆ సమస్యలు పరిష్కరించదగినవి అయితే పరిష్కరించాలి లేకుంటే వీలుకాదనో చెప్పాలి అంతే కానీ.. ఇలా రెచ్చిపోవడం ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పోనీ ఎమ్మెల్యే మీదనే ఫిర్యాదు చేస్తున్నారని కోపం వచ్చిందే అనుకోండి.. అసలు అవతలి వ్యక్తి ఏం చెబుతున్నారో కనీసం రెండు నిమిషాలు కేటాయించి వినడానికి కూడా ఓపిక కూడా లేకపోవడమేంటి..? అయినా మంత్రికి ఇంత ఫ్రస్టేషన్ ఎందుకో..? అంటూ సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అది కూడా పార్టీలో ఉండు లేకుంటే పో.. అని బొత్స అనడంతో ఆయన సొంత అభిమానులు, అనుచరులు సైతం ఆలోచనలో పడ్డారట. రేపొద్దున మనకు ఇంతకంటే దారుణంగా పరిస్థితి ఉండొచ్చేమో అని గుసగుసలాడుకుంటున్నారట. అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండమని జగన్ చెబితే మీరు ఇలా బుక్కవుతున్నారేంటి..? అని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇంతకీ సమావేశంలో జగన్ చెప్పిన మాటల్లో మీకు అర్థమయ్యాయా..? లేదా..? అర్థం అయ్యి ఉంటే మాత్రం మీరు ఇలా నలుగురిలో మాట్లాడుతూ బుక్కవ్వర్లేండి..? అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలా ఎలాగో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలకు మంచి వీడియో దొరికింది. దీన్ని వైరల్ చేస్తూ.. ఓ రేంజ్‌లో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈయన ఒక్కరే కాదు.. ఏప్రిల్-3 నుంచి ఇవాళ్టి వరకూ ఎంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు సోషల్ మీడియాకు దొరికిపోయారో.. ఎన్ని వీడియోలు వైరల్ అయ్యాయో లెక్కేలేదు.

YSRCP-Social-Media.jpg

మొత్తానికి చూస్తే.. బొత్స వ్యవహారంతో ఇప్పుడు సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియో రచ్చ అధిష్ఠానం పెద్దలకు చేరి, అక్కడ్నుంచి ఫోన్ కాల్స్ వచ్చి ఉన్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. కాలం మారిపోయింది.. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయన్న విషయం, అంతకుమించి సోషల్ మీడియా కాలమని తెలుసుకుని, ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు కాస్త ఆచి తూచి మాట్లాడితే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఫైనల్‌గా అటు వైసీపీ అధిష్ఠానం నుంచి.. ఇటు బొత్స నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************

Kiran Reddy : ఢిల్లీలో బిజిబిజీగా కిరణ్ రెడ్డి.. కీలక పదవి ఇవ్వబోతున్నారా.. పోటీ ఎక్కడ్నుంచో..!?


*****************************

KCR Video Viral : మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘వందేభారత్’ రైళ్ల గురించి కేసీఆర్ ఎన్నెన్ని మాటలు అన్నారో.. వీడియో వైరల్..

*****************************

Bandi Sanjay : సీఎం కేసీఆర్ కోసం కుర్చీ వేశాం.. సన్మానించాలని శాలువా కూడా తెచ్చాం కానీ...!


*****************************

Modi Hyderabad Tour : మోదీ తెలంగాణ పర్యటనలో చేసిందేంటి.. కేసీఆర్ సర్కార్‌పై ఏం మాట్లాడారు..!?


*****************************

TS Paper Leak : పేపర్ లీకేజీ తర్వాత బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏమనుకుంటున్నాయ్.. ఇదంతా ఆయన వ్యూహమేనా.. ఫైనల్‌గా తేలేదెప్పుడు..!?

*****************************

Updated Date - 2023-04-09T16:47:32+05:30 IST