NARA LOKESH: వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్ సంచలన ఆరోపణలు.. ముందురోజే కేతిరెడ్డికి డబ్బులు
ABN , First Publish Date - 2023-04-02T20:32:44+05:30 IST
ధర్మవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Dharmavaram YSR Congress Party) ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkataramireddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (NARA LOKESH) విమర్శలు గుప్పించారు.
శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Dharmavaram YSR Congress Party) ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkataramireddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (NARA LOKESH) విమర్శలు గుప్పించారు. ఏపీలోనే నెంబర్ వన్ కేటుగాడని, గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి ముందురోజే కేతిరెడ్డికి డబ్బులు వస్తాయని లోకేష్ ఆరోపించారు. భూములను చూసుకునేందుకే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని లోకేష్ విమర్శించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏకంగా ఎర్రగుట్టనే మింగేశారని, కేతిరెడ్డి దోపిడీని ఆధారాలతో నిరూపిస్తానని, రాజీనామా చేస్తారా? అని లోకేష్ ప్రశ్నించారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇసుక దందా చేస్తున్నారని, కేటుగాడి దోపిడీని కలెక్టర్ ముందు పెడతానని నారా లోకేష్ వెల్లడించారు. లోకేష్ యువగళం పాదయాత్ర 57వ రోజు ధర్మవరం పట్టణంలో కొనసాగింది.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పేరు ఇప్పుడు చోర్ మోహన్ అని, రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీనే అని లోకేష్ అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన వ్యక్తి చోర్ మోహన్ అని, జగన్ సర్కార్ రూ.10 ఇస్తూ.. రూ.100 దోచుకుంటోందని లోకేష్ ఆరోపించారు. రాష్ట్రానికి, ప్రజలకు చోర్ మోహన్ చేసిందేమీ లేదని మండిపడ్డారు.
బీసీలకు జగన్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారని, బీసీలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని, మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అని లోకేష్ వ్యాఖ్యానించారు.