RK Kothapaluku : తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త పలుకు’ పెను సంచలనం.. ఎక్కడ చూసినా ఆ నలుగురి గురించే చర్చ..

ABN , First Publish Date - 2023-04-30T16:12:02+05:30 IST

‘కొత్త పలుకు’ సంచలనాలకు పెట్టింది పేరు.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ స్వయంగా రాసే ఈ కాలమ్‌కు అశేష ఆధరణ ఉంది. ఆదివారం వచ్చిదంటే చాలు..

RK Kothapaluku : తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త పలుకు’ పెను సంచలనం.. ఎక్కడ చూసినా ఆ నలుగురి గురించే చర్చ..

‘కొత్త పలుకు’ సంచలనాలకు పెట్టింది పేరు.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ స్వయంగా రాసే ఈ కాలమ్‌కు అశేష ఆధరణ ఉంది. ఆదివారం వచ్చిదంటే చాలు ఆర్కే కొత్త పలుకు కోసం కోట్లాది మంది ప్రేక్షకులు, పాఠకులు పేపర్లు, టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక యూట్యూబ్‌లో అంటారా ‘కొత్త పలుకు’ వీడియోలు పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలో వేలాది మంది జనాలు ఎగబడి చూస్తుంటారు. ఎందుకంటే తెలుగు మీడియా రంగంలో రాధాకృష్ణ (ఆర్కే) విశ్లేషణలు ఓ రేంజ్‌లు ఉంటాయి గనుక. విశ్లేషణ రూపంలో వారానికో పెను సంచలనం సృష్టించే విషయాలను ఆర్కే బయటపెడుతుంటారు. ఏప్రిల్-30న ఆంధ్రజ్యోతిలో వచ్చిన కొత్త పలుకు ‘అంతఃపుర రహస్యం’పై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు ప్రజలున్న ప్రతిచోట ఇదే చర్చ. ఇంతకీ ఇవాళ ప్రచురితమైన కొత్తపలుకులో ఏముంది..? ఈ రేంజ్‌లో జనాలు ఎగబడటానికి కారణమేంటి..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

ABN-RK.jpg

అంత:పుర రహస్యం ఇదే..!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఎవర్ని విచారించినా.. ఎన్ని కోణాల్లో ప్రశ్నించినా అటు తిరిగి.. ఇటు తిరిగి రక్త సంబంధీకుల వద్దకే చేరుతోంది. కుటుంబ సభ్యులు కూడా హత్యకు కారణం బయటి వ్యక్తులే అని చెప్పడం లేదు. ఇలా రోజుకో ట్విస్ట్.. గంటకో కొత్తకోణం వెలుగు చూస్తోంది. మరోవైపు సీబీఐ దూకుడు పెంచి వీలైనంత త్వరగా ఈ కేసును కొలిక్కి తీసుకురావాలని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో 2019 మార్చి 15 అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఏం జరిగింది..? ఈ సమయంలో వైఎస్ జగన్ ఏం చేస్తున్నారు..? 2.30 గంటల నుంచి తెల్లవారుజామున 4:30 గంటల వరకూ జగన్ ఏం చేశారు..? ఆ టైమ్‌లో జగన్ రెడ్డితో ఎవరెవరు ఉన్నారు..? హత్య గురించి తెలిశాక ఎందుకు జగన్ హుటాహుటిన బయల్దేరలేదు..? అనే సంచలన విషయాలపై నిశితంగా ఆర్కే తన ‘కొత్త పలుకు’లో విశ్లేషించారు. ఇప్పుడీ విశ్లేషణ గురించే ఎక్కడ చూసినా జనాలు తెగ చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా వివేకా హత్య టైమ్‌లో జగన్ దగ్గరున్న ‘ఆ నలుగురు’ గురించి తెలుసుకోవడానికి ఔత్సాహికులు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘కొత్త పలుకు’ క్లిప్పింగ్‌లు వైరల్ అవుతుండగా.. దీనిపైనే ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో చర్చ.. ఇక కామెంట్స్‌కు అయితే కొదువేలేదు.

Viveka-Kothapaluku.jpg

ఆ నలుగురు ఎవరంటే..!

వివేకానంద రెడ్డి హత్య విషయం జగన్మోహన్‌ రెడ్డి దంపతులకు ముందుగానే తెలుసని చెప్పడానికి ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నాయి. వివేకా హత్య 2019 మార్చి 15 అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో జరిగింది. అదేరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసమై నలుగురు ముఖ్యులను జగన్మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. ఇది ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం. తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఆ నలుగురితో జగన్మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఇంతలోనే మేడ మీద నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ఇంట్లోకి వెళ్లిన జగన్‌రెడ్డి పది నిమిషాల తర్వాత తిరిగి సమావేశ ప్రదేశానికి వచ్చారు. చిన్నాన్న గుండెపోటుతో చనిపోయారని ఆ నలుగురికీ చెప్పి సమావేశాన్ని కొనసాగించారు. అంటే, వివేకా హత్య గురించి ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్‌ రెడ్డి దంపతులకు తెలుసునని స్పష్టమవుతోంది. హత్య తర్వాత అవినాశ్‌ రెడ్డి ఫోన్‌ నుంచి జగన్‌ దంపతుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు వెళ్లాయని సీబీఐ విచారణలో కూడా వెల్లడైన విషయం విదితమే.

RK-Anthahpura-Rahasyam.jpg

- చిన్నాన్నను ఏమి చేశారో తెలిసి కూడా జగన్మోహన్‌ రెడ్డి చలించకుండా ఎన్నికల ప్రణాళిక గురించి చర్చించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కరడుగట్టిన మనస్తత్వం ఉన్నవారు మాత్రమే అలా ప్రవర్తించగలరు. ఒకవేళ వివేకాది సహజ మరణమే అయినప్పటికీ చనిపోయిన చిన్నాన్న భౌతికకాయానికి నివాళులర్పించడానికి జగన్‌ స్థానంలో ఎవరున్నా ఉన్నపళంగా బయలుదేరి వెళతారు. జగన్‌ దంపతులు అలా చేయకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. జగన్‌తో ఆ రోజు సమావేశమైన ఆ నలుగురూ ఇప్పటికీ ఆయనతోనే ఉన్నారు. ఆ నలుగురూ మరెవరో కాదు! ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్‌ పర్సనల్‌ సెక్రటరీ కృష్ణమోహన్‌ రెడ్డి, దివంగత సోమయాజులు కుమారుడు కృష్ణ (అధికారంలోకి వచ్చాక ఆయనను ఆర్థిక శాఖ స్పెషల్‌ సెక్రటరీగా నియమించారు), రిటైర్డ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం. సీబీఐ అధికారులు ఈ నలుగురినీ విచారిస్తే అసలేం జరిగిందో బయటికొస్తుంది. వివేకా హత్య వెనుక విస్తృత స్థాయి కుట్ర ఉందని సీబీఐ మొదటి నుంచీ చెబుతోంది. ఇప్పుడు అది నిజమేనని నమ్మక తప్పని పరిస్థితి.

చూశారుగా ఇదీ పరిస్థితి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలుగు ప్రజలున్న ప్రతి చోటా ‘అంత:పుర రహస్యం’ అనే ఆర్కే ‘కొత్త పలుకు’ గురించే చర్చ. ఆ నలుగురు ఎవరని తెలుసుకోవడానికి జనాలు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు. ఇక అవన్నీ అటుంచితే ఈ వ్యాసం చదివిన వైసీపీ నేతలు, ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబీకులు సైతం నివ్వెరపోయారట. దమ్మున్న ఆంధ్రజ్యోతిలో రాసినవన్నీ అక్షర సత్యాలే కావడంతో కనీసం కౌంటర్ ఇవ్వడం గానీ.. కనీసం ప్రకటన రూపంలో అయినా ఖండించడానికి ప్రయత్నించలేదంటే సీన్ అర్థమయ్యే ఉంటుందిగా..!.

ఆర్కే కొత్త పలుకు.. ‘అంతఃపుర రహస్యం’ పూర్తి ఆర్టికల్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

******************************

ఇవి కూడా చదవండి..

******************************

CBN and Pawan : ముచ్చటగా మూడోసారి చంద్రబాబు-పవన్ భేటీ.. అరగంటపాటు ఏమేం చర్చించారు..!?


******************************

YSRCP On Rajanikanth : అతిథిగా వస్తే తలైవాను టార్గెట్ చేయడమేంటి.. వైసీపీ ఇంత నీచానికి దిగజారాలా.. ఈ కామెంట్స్‌గానీ చూశారో..!?

******************************

Pawan Meets CBN : పవన్-చంద్రబాబు ఏకాంత భేటీలో ఏం చర్చించారో పూసగుచ్చినట్లుగా చెప్పిన నాదెండ్ల.. భవిష్యత్తులో..

******************************

Updated Date - 2023-04-30T16:30:58+05:30 IST