KotamReddy SridharReddy: వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఝలక్

ABN , First Publish Date - 2023-01-31T14:54:44+05:30 IST

వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఝలక్ ఇచ్చారు.

KotamReddy SridharReddy: వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఝలక్

నెల్లూరు: వైసీపీ (YCP)కి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA KotamReddy SridharReddy) ఝలక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ (TDP) నుంచి పోటీ చేస్తానని కోటంరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (YCP MLA) పార్టీ మారే విషయంపై ఏబీఎన్ (ABN - Andhrajyothy) చేతిలో కీలక‌ ఆధారం లభించింది. ‘‘ఫోన్ ట్యాపింగ్‌పై నేను సాక్ష్యాలు బయటపెడితే.. ఇద్దరు ఐపీఎస్‌ల ఉద్యోగాలు పోతాయి. వైసీపీ ప్రభుత్వం షేక్ అవుతుంది.. సెంట్రల్ ఎంక్వైరీ వస్తుంది’’ అంటూ ఆప్తులు, సన్నిహితుల రహస్య సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ ఆధారాన్ని కోటంరెడ్డి బయటపెట్టారు. కోటంరెడ్డి పార్టీ మార్పు అంశం వైసీపీలో చర్చీనీయాంశంగా మారింది. దీనిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

కాగా... తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కోటంరెడ్డి ఇటీవల మీడియా ప్రతినిధులకు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై అనేక వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో మంత్రి కాకాణి (Minister Kakani Govardhan Reddy) ఈరోజు ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఏదైనా రాయడానికి విషయపరిజ్ఞానం ఉండాలి. రాస్తే మన నోట్లో ఊస్తారనే సిగ్గు, బిడియం ఉండాలి. అన్నీ విడిచి నగ్నంగా తయారై రాస్తున్న రాతలివి. కోటంరెడ్డి పార్టీ మారడం, రూరల్‌కు సమన్వయకర్త రావడం అనేది కేవలం మీడియా సృష్టే. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్‌లు జరగవు. ఇవన్నీ టీ కప్పులో తుఫాను వంటివి. కోటంరెడ్డి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఏదైనా మనస్సు నొచ్చుకుని ఉంటే, తెలుసుకుని సమస్యని పరిష్కరిస్తాం’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే మంత్రి కాకాణి వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రిగా భాద్యతాయుతమైన పదవిలో ఉంటూ మీడియా ప్రతినిధులను అగౌరవ పరిచే విధంగా మాట్లాడటం ఏంటని జర్నలిస్టులు మండిపడుతున్నారు.

అయితే టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ తన అనుచరుల ముందు స్వయంగా కోటంరెడ్డి చెప్పిన కీలక ఆధారాన్ని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంపాదించింది. ఇటీవల ఆత్మీయులు, సన్నిహితులతో కోటంరెడ్డి రహస్యంగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీలో తనకు సరైన గౌరవం లేదని, పార్టీకి తనపై నమ్మకం లేదంటూ పలు విషయాలను చర్చించారు. 2024లో టీడీపీ తరపున నెల్లూరు రూరల్ నుంచి పోటీచేయబోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో కోటంరెడ్డి పార్టీ మారడం లేదంటూ మీడియాపై విరుచుకుపడ్డ మంత్రి కాకాణి... కోటంరెడ్డి ఆడియోపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Updated Date - 2023-01-31T15:16:44+05:30 IST