Shocking: మీ అమ్మాయిని పూడ్చి పెట్టిన చోట ఏవో వింత శబ్దాలు వస్తున్నాయని చెప్పిన కాటికాపరి.. అనుమానంతో తవ్వి చూస్తే..!
ABN , First Publish Date - 2023-08-18T21:49:15+05:30 IST
పుట్టిన ప్రతి మనిషికీ మరణం అనేది సహజం. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడొచ్చేమో గానీ.. చావు నుంచి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. అయితే కొన్నిసార్లు కొందరు మాత్రం.. చావు చివరి అంచుల వరకూ వెళ్లి ప్రాణాలతో బయటపడుతుంటారు. కొన్నిసార్లు తీరా అంత్యక్రియలు చేసే సమయంలో...
పుట్టిన ప్రతి మనిషికీ మరణం అనేది సహజం. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడొచ్చేమో గానీ.. చావు నుంచి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. అయితే కొన్నిసార్లు కొందరు మాత్రం.. చావు చివరి అంచుల వరకూ వెళ్లి ప్రాణాలతో బయటపడుతుంటారు. కొన్నిసార్లు తీరా అంత్యక్రియలు చేసే సమయంలో ఉన్నట్టుండి శరీరంలో కదలికలు వచ్చిన సందర్భాలను గతంలో చాలా చూశాం. తాజాగా, ఇలాంటి వింత ఘటనకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి సమాధి నుంచి వింత శబ్ధాలు వచ్చాయి. గమనించిన కాటికాపరి యువతి కటుంబ సభ్యులకు తెలియజేశాడు. చివరకు 11 రోజుల తర్వాత తవ్వి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర బ్రెజిల్‌లో (Northern Brazil) 2018లో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వార్త తెగ వైరల్ (Viral news) అవుతోంది. రోసంగేలా అల్మెడా అనే 37 ఏళ్ల మహిళ 2018 జనవరిలో అకస్మాత్తుగా గుండెపోటుకు (heart attack) గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయిందని చెప్పారు. చివరకు మరణ ధ్రువీకరణ పత్రం కూడా మంజూరు చేశారు. అనంతరం మృతదేహాన్ని శవ టేకికలో ఉంచి దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే తర్వాత రోజు నుంచి కాటికాపరికి వింత వింత శబ్ధాలు వినిపించడం మొదలెట్టాయి. మొదట అతడికి ఎలాంటి అనుమానం రాలేదు.
Train Video: బాబోయ్.. ఇంత రిస్క్ చేశావేంటమ్మా..? తేడా వస్తే ప్రాణాలే పోతాయని తెలిసినా..!
అయితే రోజూ ఇలాగే శబ్ధాలు వస్తుండడంతో సమాధుల వద్ద పరిశీలించాడు. 11 రోజుల తర్వాత చివరికి యువతిని పూడ్చి పెట్టిన స్థలం వద్ద నుంచే వస్తున్నాయని తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని యువతి కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. చివరకు అంతా కలిసి పూడ్చిన చోట తవ్వి శవ పేటికను (coffin was taken out) బయటికి తీసి తెరిచారు. లోపల యువతి చేతులన్నీ రక్తంతో తడిసి ఉండడం చూసి షాక్ అయ్యారు. పూడ్చిన సమయంలో ఎలాంటి గాయాలూ లేని శరీరం.. అలా రక్తంతో తడిసి ఉండడం చూసి వారంతా నమ్మలేకపోయారు. శవ పేటికను తెరచుకుని బయటికి వచ్చేందుకు ఆమె ఎంతగానో ప్రయత్నించినట్లు గుర్తించారు.
Wife: భర్తకు విడాకులు ఇచ్చి.. రూ.8.30 లక్షలు నష్టపోయిందో భార్య.. అదేంటని అవాక్కవుతున్నారా..?
అయితే దురదృష్టవశాత్తు బయటికి తీసిన సమయంలో యువతి ప్రాణాలతో లేదు. అంటే పూడ్చిన సమయంలో ఆమె చనిపోలేదని గ్రహించారు. బ్రెజిల్ చట్టాల (Brazil Laws) ప్రకారం ఇది పెద్ద నేరం. ఇందుకు సుమారు మూడేళ్ల వరకూ జైలు శిక్ష (Imprisonment) విధించే అవకాశం ఉంది. అయితే యువతిని కావాలనే ఇలా చేయలేదని అధికారులు గుర్తించడంతో సమస్య సర్దుమణిగింది. అయితే పూడ్చిన సమయంలో గుర్తించి, బయటికి తీసి ఉంటే యువతి బతికి ఉండేదని అంతా కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.