Wife: ఫోన్ వచ్చినప్పుడల్లా దూరంగా వెళ్లి మాట్లాడుతున్న భార్య.. అనుమానం వచ్చి చాటుగా విన్న భర్తకు మైండ్‌బ్లాక్.. చివరకు..!
ABN , First Publish Date - 2023-08-18T18:52:32+05:30 IST
ప్రస్తుత సమాజంలో మగవారితో పాటూ చాలా మంది మహిళలలో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు, వివాహేతర సంబంధాల విషయంలో మరికొందరు, పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇంకొందరు నేరాలకు పాల్పడుతుండడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇటీవల...
ప్రస్తుత సమాజంలో మగవారితో పాటూ చాలా మంది మహిళలలో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు, వివాహేతర సంబంధాల విషయంలో మరికొందరు, పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇంకొందరు నేరాలకు పాల్పడుతుండడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఇలాంటి నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా, మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఫోన్ వచ్చినప్పుడల్లా భార్య పక్కకు వెళ్లి మాట్లాడుతూ ఉండేది. దీంతో ఓ రోజు భర్తకు అనుమానం వచ్చి చాటుగా విన్నాడు. చివరకు అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర (Maharashtra) పాల్ఘర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మాండ్వి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇదిలావుండగా, ఇతడి వదినకు, భార్యకు మధ్య కొంత కాలంగా (Quarrels between women) గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త వదినపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని భార్య వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉండేది. రోజూ ఇదే విషయంపై ఎవరెవరితోనే మాట్లాడుతూ ఉండేది. అయినా భర్తకు మొదట్లో ఎలాంటి అనుమానమూ రాలేదు. ఈ క్రమంలో ఇటీవల భర్త వదిన గర్భం (pregnancy) దాల్చింది.
Wife: భర్తకు విడాకులు ఇచ్చి.. రూ.8.30 లక్షలు నష్టపోయిందో భార్య.. అదేంటని అవాక్కవుతున్నారా..?
ఈ విషయం తెలుసుకున్న భార్యకు పట్టరాని కోపం వచ్చింది. ఏం చేసైనా ఆమె గర్భాన్ని పోగొట్టించాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం తెలిసిన వారి ద్వారా ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం అతడికి రూ.4,000లు డబ్బులు పంపించి, తన భర్త వదినకు గర్భం పోయేలా చేయాలని చెప్పింది. ఇదే విషయంపై మంగళవారం ఆమె తాంత్రికుడితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంది. అప్పటికే భార్యపై ఓ కన్నేసిన భర్త.. ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకునేందుకు సమీపానికి వెళ్లి చాటుగా విన్నాడు. చివరకు భార్య కుట్ర తెలుసుకుని షాక్ అయ్యాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితురాలితో పాటూ మరో వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిసింది. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.