Viral Video: తనకు సంబంధం లేకున్నా.. చొరవ తీసుకుని మరీ.. ఈ ఎయిర్ హోస్టెస్ చేసిన పని చూడండి..
ABN , First Publish Date - 2023-12-09T19:11:07+05:30 IST
ఉద్యోగుల్లో చాలా మంది వివిధ రకాల మనస్తత్వం కలిగి ఉంటారు. కొందరు తమ విధులు నిర్వర్తించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తుంటే.. మరికొందరు తమ పని తప్ప ఇతరులతో సంబంధం లేనట్లు ప్రవర్తిస్తుంటారు. అయితే...
ఉద్యోగుల్లో చాలా మంది వివిధ రకాల మనస్తత్వం కలిగి ఉంటారు. కొందరు తమ విధులు నిర్వర్తించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తుంటే.. మరికొందరు తమ పని తప్ప ఇతరులతో సంబంధం లేనట్లు ప్రవర్తిస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం తమ బాధ్యతలు తాము నిర్వర్తిస్తూనే మానవత్వం చూపుతూ ఇతరులకూ సహాయసహకారాలు అందిస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ ఎయిర్ హోస్టెస్ చేసిన పనిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. తనకు సంబంధం లేకున్నా చొరవ తీసుకుని మరీ ఆమె చేసిన పని చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. టోక్యోకి వెళ్లే విమానంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ (Singapore Airlines) విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లోకి లేవగానే యథావిధిగా ప్రయాణికులందరికీ ఎయిర్ హోస్టెస్ (Air hostess) సలహాలు, సూచనలు ఇస్తోంది. ఇంకొందరు ఫుడ్ డెలివరీ పనిలో పడ్డారు. అయితే ఈ సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బిజినెస్ క్లాస్ (Business class) ప్రయాణికులకు ఫుడ్ డెలివరీ చేస్తున్న ఎయిర్ హోస్టెస్.. ఓ చిన్న పిల్లాడిని గమనించింది.
Viral Video: వరుడు ఒక్కడే.. వధువులు మాత్రం ఏకంగా నలుగురు.. కనీవినీ ఎరుగని అరుదైన పెళ్లి..!
సదరు బాలుడు టేబుల్‌పై ఉన్న ఫుడ్ తినకుండా వీడియో గేమ్స్ ఆడటంలో బిజీబిజీగా ఉంటాడు. పిల్లాడిని గమనించిన ఎయిర్ హోస్టెస్.. దగ్గరికి వెళ్లి, ప్లేటులోని ఆహారాన్ని (air hostess feeding a child) ఎంతో ప్రేమతో తినిపిస్తుంది. ఇలా చాలా సేపు అక్కడే కూర్చుని పిల్లాడికి ఆహారం తినిపిస్తుంది. ఈ ఘటనను పక్కనే ఉన్న ప్రయాణికుడు వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డబ్బులుంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘పిల్లాడిని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉండాలి’’.. అంటూ మరికొందరు, ‘‘ఎయిర్ హోస్టెస్ నిజంగా చాలా గ్రేట్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: సైకిల్‌కి, చెప్పులకు నిప్పు.. చలిని తట్టుకునేందుకు ఇతడు చేసిన పని చూడండి..